అంబాలాల్ సారాభాయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
}}
[[Category:Articles with hCards]]
'''అంబాలాల్ సారాభాయ్''' (1890 ఫిబ్రవరి 23 - 1967 జూలై 13) భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, సంస్థల వ్యవస్థాపకుడు, [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీకి]] గట్టి మద్దతుదారు, సంస్కృతిలో విభిన్నమైన ఆసక్తులు కలిగిన వ్యక్తి . ఇతడు కాలికో మిల్స్ చైర్మన్, ప్రమోటర్, సారాభాయ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు . అతను భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు .
 
== నేపథ్యం, ప్రారంభ జీవితం ==
అంబాలాల్ ఖాన్‌పూర్‌లోని చంద్ర-సూరజ్ మహేల్‌లో సారాభాయ్ మగన్‌భాయ్ : గోదావారిబా దంపతులకు జన్మించారు . ఇతడు అంబాజీమాత దయాభిక్షగా జన్మించాడని గోదావరీబా దృఢమైన నమ్మకం, అందుకే అతనికి 'అంబాలాల్' అని పేరు పెట్టారు .
 
తల్లిదండ్రుల మరణం తర్వాత మామ చిమన్ భాయ్ ముగ్గురు పిల్లలను (అనసూయ, అంబాలాల్, కాంత) జాగ్రత్తగా చూసుకున్నాడు . అంబాలాల్ 1907 లో గుజరాత్ కాలేజీలో చేరిన కొద్దికాలానికే అతని మామ చిమన్ భాయ్ ఆకస్మిక మరణం కారణంగా కాలికో, జూబ్లీ మిల్స్ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు . అతడు 1910 లో అతను శ్రీ హరిలాల్ గోసాలియా కుమార్తెయైన రేవాను వివాహం చేసుకున్నాడు . వివాహానంతరం ఆమె పేరును సరళాదేవి సారాభాయ్ అని మార్చారు . అతను తరువాత కుర్రమ్‌చంద్ ప్రేమ్‌చంద్ ని పెధి (కుటుంబ వ్యాపారం) డైరెక్టర్‌గా చేరాడు . అంబాలాల్ కు సరళాదేవిద్వారా ఎనిమిది మంది పిల్లలు కలిగారు . వీరిపేర్లు వరుసగా: మృదుల (1911-1974), భారతి (1912-1986), సుహ్రిద్ (1913-1942), లీనా (1915-2012), గౌతమ్ (1917-1995), [[విక్రం సారాభాయ్|విక్రమ్]] (1919-1971), గీత (1921-2011), గీరా (1923-2021) . అతని కుటుంబానికి మెడిసి ఆఫ్ అహ్మదాబాద్ అని పేరుపొందింది .
 
== వ్యాపారం ==
[[దస్త్రం:Gita_and_Ambalal,_Ahmedabad,_1952.jpg|thumb| కుమార్తె గీతా సారాభాయి తో అంబాలాల్, 1952]]
1922 లో, సారాభాయ్ ఇంగ్లాండ్ నుండి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి, వస్త్రాల తయారీ పరిశ్రమలో అనేక ఆవిష్కరణలకు దారితీసే ఆధునిక సాంకేతిక పద్ధతులను, విభిన్నమైన ఆలోచనలను పరిచయం చేశాడు . భారతదేశంలో ఈ ఆధునిక సాంకేతికతలను స్వీకరించిన మొట్టమొదటి మిల్లుగా కాలికో మిల్లు నిలిచింది .
 
1931 లో, అతను కృష్ణ ఆయిల్ మిల్లులను కొని స్వస్తిక్ ఆయిల్ మిల్స్‌గా పేరు మార్చాడు, ఇవి ఇంగ్లండు నుండి తెచ్చిన ఆధునిక సాంకేతికతల సహాయంతో వేరుశెనగ, నువ్వుల నూనె తయారీని ప్రారంభించింది . తరువాత, ఈ ఆయిల్ మిల్స్ కూడా డిటర్జెంట్ సబ్బులు, సువాసనభరితమైన [[ఆముదము నూనె|ఆముదం నూనె]] తయారీని ప్రారంభించింది . 1943 లో సారాభాయ్ బరోడాలో సారాభాయ్ కెమికల్స్ ప్రారంభించాడు . దీనిని అతని కుమారుడు డాక్టర్ [[విక్రమ్ సారాభాయ్]] నిర్వహించారు . తరువాత ఇతడు న్యూయార్క్ లోని స్క్విబ్ & కంపెనీ తో సహకారం పెంపొందించాడు, జర్మన్ కంపెనీ మెర్క్ సహకారంతో సారాభాయ్ మెర్క్ లిమిటెడ్ ను, స్విస్ కంపెనీ జెఆర్ గీగీ సహకారంతో సుహ్రిద్ గీగీ లిమిటెడ్‌ను ప్రారంభించాడు .
 
సారాభాయిలు కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్న స్టాండర్డ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు . వీరు సిన్బయోటిక్స్ లిమిటెడ్‌తో కూడా సంబంధం కలిగివున్నారు . సారాభాయ్ కెమికల్స్ సంస్థ స్ట్రెప్టోమైసిన్, పెన్సిలిన్, విటమిన్లు, యాంటీబయాటిక్‌లను తయారు చేసేది .
 
అంబాలాల్ సారాభాయ్ 1919 లో బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు . 1935 జనవరి 3 తేదీన ఎఫ్ . ఇ . దిన్షా పదవీకాలం తర్వాత అంబాలాల్ ఛైర్మన్ అయ్యాడు . అతను బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నలభై ఐదు సంవత్సరాలకు పైగా గౌరవ సలహాదారుగా సంబంధం కలిగి ఉన్నాడు . 1910 లో ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులోనే ప్రభుత్వం ద్వారా అహ్మదాబాద్ పురపాలకసంఘం సభ్యుడిగా నియమించబడ్డారు .
 
== భారతదేశ స్వాతంత్ర్యంలో పాత్ర ==
1927 లో, ఇతడు వల్లభాయ్ కి చెందిన జాతీయవాద రాష్ట్రీయ పక్షం తో పోటీ పడటానికి స్వతంత్ర పార్టీ (స్వతంత్ర) ను స్థాపించాడు . సారాభాయ్, వల్లభాయ్ ల మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా, 1929 లో సారాభాయ్ రాజీనామా చేశారు .
 
గాంధీ భారతదేశంలో ఏదైనా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కూడా, సారాభాయ్ 1916 నుండి మహాత్మా గాంధీకి, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన మద్దతుదారు . గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం సారాభాయ్ ఇచ్చిన ఉదార విరాళంతో పునరుద్ధరించబడింది .
 
1947 లో, సారాభాయ్ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ అయ్యారు .
 
== దాతృత్వం ==
ఇతడు స్థాపించిన అంబాలాల్ సారాభాయ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ [[వడోదర|వడోదరలో]] ఒక ఆసుపత్రిని నిర్వహిస్తోంది . అంబాలాల్ సారాభాయ్ ఫౌండేషన్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ & వెల్ఫేర్, అంబాలాల్ సారాభాయ్ ట్రస్ట్ ఇతడు స్థాపించిన మరొక రెండు ప్రధాన ధార్మిక ట్రస్టులు . ఇప్పుడు ఈ రెండింటిని అంబాలాల్ వారసులు చూసుకుంటున్నారు . ఈ ట్రస్టులన్నీ కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ లోనే కాక కొన్ని ఇతర నగరాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, ధార్మిక దవాఖానాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంబాలాల్_సారాభాయి" నుండి వెలికితీశారు