ఆంగ్ల భాష: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: మానవిక తిరగవేత 2017 source edit
పంక్తి 66:
అనువాదకులు తేటతెలుగుకు బదులు [[సంస్కృతము|సంస్కృతం]] వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడం లేదు. ఇది మన జాతి చేతకానితనం, దౌర్భాగ్యం. పైన పేర్కొన్న వందలాది పదాలేగాక ఇంకెన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. [[ఉర్దూ భాష|ఉర్దూ]], సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీశు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?
 
కొందరికి పూర్తిగా ఆంగ్లభాషపై వెర్రి [https://inlarn.com/java-programming-examples-with-source-code/ వ్యామోహం] ఉంటుంది. అలాకాకుండ వాస్తవస్థితిని గ్రహించి మనభాషను రక్షించుకుంటూ, ఆంగ్లపదాలను వాడుకోవడం తెలివైన పద్ధతి. లెక్కల మాస్టరు 2+2=4 అనే దాన్ని రెండు ప్లస్‌ రెండు ఈజ్‌ ఈక్వల్‌టు నాలుగు '' అంటాడు. ఇప్పటి వరకు ప్లస్‌, ఈజీక్వల్టు, మైనస్‌, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ప్లస్‌, మైనస్‌ అనే శబ్దాలనే వాడుతున్నారు. గత్యంతరం లేదు, అనుకున్న ఆంగ్ల పదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాష పదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీశు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీశును గత్యంతరం లేక హద్దు మీరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీశు పదాలను నిర్మూలించటం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించటమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి. మరోభాషా పదం మనలో పాతుకు పోకూడదనే ఆశయం ఉంటే, మనభాషలోనే కొత్త పదాలను సృష్టించటమే గాక, వాటిని ప్రజలంతా నిరంతరం వాడుతూ ఉండాలి.
 
[[ఇంగ్లీశు-తెలుగు అనువాద సమస్యలు]]
"https://te.wikipedia.org/wiki/ఆంగ్ల_భాష" నుండి వెలికితీశారు