మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: మార్సెల్ డుషాంప్ ఫౌంటెయిన్
→‎చరిత్ర: కాంటెంపరరీ ఆర్ట్ కు, మాడర్న్ ఆర్ట్ కు గల భేదాలు
పంక్తి 10:
 
దాదాపుగా ఇదే కాలావధిలో అభివృద్ధి చెందిన [[ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్]], దృశ్య కళలలోకి [[ఫోటోగ్రఫీ]] చొచ్చుకు రావటం, యాంత్రిక పద్ధతుల/రసాయనాల వలన స్పష్టమైన చిత్రీకరణ సాధ్యపడటం (తద్వారా మనవీయ చిత్రీకరణ కు ఆదరణ తగ్గటం) తో చిత్రలేఖనం లో యథాతథంగా చిత్రీకరించవలసిన అవసరం దానంతట అదే పోయింది.
 
== కాంటెంపరరీ ఆర్ట్ కు, మాడర్న్ ఆర్ట్ కు గల భేదాలు ==
ఒకే కాలావధిని సూచిస్తున్నట్లు అగుపించినా, కాంటెంపరరీ ఆర్ట్ వేరు, మాడర్న్ ఆర్ట్ వేరు.
 
=== మాడర్న్ ఆర్ట్ ===
ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.<ref name=":2">{{Cite web|url=https://www.britannica.com/story/whats-the-difference-between-modern-and-contemporary-art|title=What’s the Difference Between Modern and Contemporary Art?|website=britannica.com|url-status=live|access-date=12 September 2021}}</ref> వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.
 
=== కాంటెంపరరీ ఆర్ట్ ===
సాంకేతిక పురోగతి [[చిత్రలేఖనం]], [[ఫోటోగ్రఫీ]], [[శిల్పకళ]] ల పై ఏ విధంగా ప్రభావం చూపిందో తెలిపే శైలియే కాంటెంపరరీ ఆర్ట్.<ref name=":1">{{Cite web|url=https://www.riseart.com/guide/2400/what-is-contemporary-art|title=What is Contemporary Art|last=Martin|first=Tatty|website=riseart.com|url-status=live|access-date=12 September 2021}}</ref> సౌందర్య సృష్టిని ధిక్కరించి సృష్టించే కళాఖండం, అందులోని అంశాన్ని తెలియజేయటమే కాంటెంపరరీ ఆర్ట్ యొక్క లక్షణం.<ref name=":2" /> కాంటెంపరరీ ఆర్ట్ లో తుది ఫలితం యొక్క ప్రాధాన్యత తుక్కువ. కళాకారుడు ఆ ప్రక్రియను ఎలా అవలంబించాడు అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రక్రియ లో ఈ నాటి వీక్షకుడి అభిప్రాయం కూడా చర్చకు వస్తుంది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు