నిన్నే పెళ్ళాడతా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎తారాగణం: నిర్మాణం, విడుదల, ఫలితాల చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* [[సన]]
 
== నిర్మాణం ==
దర్శకుడు కృష్ణవంశీ మొదటి చిత్రం గులాబి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా నాగార్జున కృష్ణవంశీని కలిసి తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. మొదట్లో కృష్ణవంశీ నాగార్జునతో ఒక యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలనుకుని కథ ఒకటి వినిపించాడు. నాగార్జునకు ఆ కథ నచ్చి సినిమాకు ఓకే చెప్పాడు. కానీ గులాబీ సినిమా విడుదలైన తర్వాత అది తన గురువు రాం గోపాల్ వర్మ స్టైల్లో ఉందనే వ్యాఖ్యలు ఆయన్ను ఆలోచింపజేశాయి. అందుకోసం ఆయన నిన్నే పెళ్ళాడతా లాంటి కుటుంబ కథను ఎంచుకుని మళ్ళీ నాగార్జునకు ఆకథను వినిపించాడు. నాగార్జున మొదట్లో సందేహించినా తర్వాత అంగీకరించాడు. పది రోజుల్లో స్క్రిప్టు పని పూర్తయింది. నాగార్జున ఈ చిత్రంగా అన్నపూర్ణ పతాకంపై స్వయంగా నిర్మించాడు.<ref name="eenadu25">{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-nagarjuna-and-tabu-ninne-pelladatha-completed-25-years/0201/121203466|title=Ninne Pelladata: ఎవర్‌గ్రీన్‌ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’కు 25ఏళ్లు - telugu news nagarjuna and tabu ninne pelladatha completed 25 years|website=www.eenadu.net|language=te|access-date=2021-10-04}}</ref>
 
కథానాయిక కోసం సుమారు 65 మందిని పరీక్షించారు. తర్వాత కృష్ణవంశీ ముందుగా ముంబై వెళ్ళి టబును ఒప్పించివచ్చాడు. సంగీత దర్శకుడిగా [[సందీప్ చౌతా]] ఎంపికయ్యాడు. ఆయనకు ఇదే తొలిచిత్రం.
 
== విడుదల ==
అక్టోబరు 4, 1996 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లో 12 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.<ref name="eenadu25"/>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నిన్నే_పెళ్ళాడతా" నుండి వెలికితీశారు