హరే కృష్ణ మహతాబ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఒడిశా రచయితలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 69:
 
== రాజకీయ జీవితం ==
1922లో, మహతాబ్ జైలు పాలయ్యాడు.దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను 1924 నుండి 1928 వరకు బాలసోర్ జిల్లా బోర్డు ఛైర్మనుగా పనిచేసాడు.అతను 1924లో బీహార్, ఒడిషా కౌన్సిల్ సభ్యుడయ్యాడు. అతను [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో]] చేరి,1930లో మళ్లీ జైల్ పాలయ్యాడు. 1932లో పూరీలో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెసు]] సభల కోసం కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఎన్నికయ్యాడు. పార్టీని నిషేధించినప్పుడు అతడిని నిర్బందంలోకి తీసుకున్నారు. 1934లో అతను [[అంటరానితనం|అంటరానితనానికి]] వ్యతిరేకంగా జరిగినఉద్యమంలో ఒడిశాలో మొదటిసారిగా తన పూర్వీకుల ఆలయాన్ని తెరచి అందరికీ ప్రవేశం కల్పించాడు.తరువాత అగర్‌పడ్ లో అతనుగాంధీ కర్మమందిరాన్ని ప్రారంభించాడు. అతను1930 నుండి 1931 వరకు, మళ్లీ 1937లో ఉత్కల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.1938లో సుభాష్ చంద్రబోస్ చేత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నామినేట్ అయ్యాడు.1938 నుండి1946 వరకు,మళ్లీ 1946 నుండి1950 వరకు కొనసాగాడు. అతను1938లో రాష్ట్ర ప్రజల విచారణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.సనద చట్టం రద్దు చేయాలని, పూర్వపు సంస్థానాలను ఒడిషా రాజ్యంలో విలీనం చేయాలని పాలకులకు సిఫారసు చేశాడు. అతను 1942లో [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమంలో]] పాల్గొన్నందుకు 1942 నుండి 1945 వరకు జైలు శిక్ష అనుభవించాడు.<ref name="gandhitopia">{{Cite web|url=http://www.gandhitopia.org/profiles/blogs/harekrushna-mahatab|title=Harekrushna Mahatab – GandhiTopia|publisher=gandhitopia.org|access-date=1 October 2014|website=|archive-date=6 అక్టోబర్ 2014|archive-url=https://web.archive.org/web/20141006102102/http://www.gandhitopia.org/profiles/blogs/harekrushna-mahatab|url-status=dead}}</ref> <ref name=":0">{{Cite web|url=https://bhadrak.nic.in/about-district/|title=About District {{!}} Bhadrak District, Government of Odisha {{!}} India|access-date=2021-09-11}}</ref>
 
మహతాబ్ 1946 ఏప్రిల్ 23 నుండి1950 మే 12 వరకు ఒడిశా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను 1950 నుండి1952 వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిగా,1952లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. అతను 1955 నుండి 1956 వరకు బొంబాయి గవర్నర్‌గా వ్యవహరించాడు.<ref name=":0" /> <ref name="google">{{Cite book|url=https://books.google.com/books?id=nR0f25dmbn0C|title=Memoirs of Nikita Khrushchev|last=Khrushchev, N.S.|last2=Khrushchev, S.|date=2007|publisher=Pennsylvania State University|isbn=9780271029351|issue=v. 3}}</ref> <ref name="google2">{{Cite book|url=https://books.google.com/books?id=rRYeAAAAMAAJ|title=While Serving My Nation: Recollections of a Congress Man|last=Mahtab, H.|date=1986|publisher=Vidyapuri}}</ref> 1956లో గవర్నర్ పదవికి రాజీనామాచేసి, మళ్లీ 1956 నుండి 1960 వరకు ఒడిశా ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, పూర్వపు రాచరిక రాష్ట్రాల విలీనం, సమైక్యత, రాజధానిని [[కటక్]] నుండి [[భుబనేశ్వర్|భువనేశ్వర్‌కు]] మార్చడం, బహుళ ప్రయోజన హీరాకుడ్ డ్యాం మంజూరు నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను 1962లో [[అంగుల్ లోకసభ నియోజకవర్గం|అంగుల్]] నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.1966లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.1966లో, అతను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఒరిస్సా జన కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాడు. అతను 1967, 1971,1974లో ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. అత్వసర పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు 1976లో జైలుపాలయ్యాడు. <ref name="google3">{{Cite book|url=https://books.google.com/books?id=ifuxzl9NM5sC|title=Rashtriya Swayamsevak Sangh: National Upsurge|last=Chitkara, G.|date=2004|publisher=A.P.H. Publishing Corporation|isbn=9788176484657|page=289}}</ref>
"https://te.wikipedia.org/wiki/హరే_కృష్ణ_మహతాబ్" నుండి వెలికితీశారు