అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పాడు.<ref name=":2" /> ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.<ref name=":2" />
 
2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. మూడు వేర్వేరు గొట్టాల ద్వారా వేడి నీరు, గోధుమ నూక, రెండు విడతలుగా పంచదార కళాయిలో పడేలా ఈ యంత్రంలో ఏర్పాటుచేస్తుంది. ఉడికిన తర్వాత నెయ్యి కలిపి, యాలకుల పొడి చల్లడం వంటవారు చేయాల్సి ఉంటుంది. కళాయికి రెండువైపులా ఉన్న చక్రాలను వంచితే పూర్తైన ప్రసాదం ప్యాకింగ్ కోసం తీసుకువెళ్ళేందుకు మరో తొట్టిలో పడుంతుంది. 45 నిమిషాల్లో కళాయి ప్రసాదాన్ని వండేందుకు ఈ కొత్త ప్రక్రియ వీలు కల్పిస్తోంది.
 
== పంపిణీ ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు