బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
== ప్రారంభం ==
బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకురాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకను అందించాలన్న ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] అలోచనలోంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.
 
== పంపిణీ వివరాలు ==
ప్రతిఏటా నవరాత్రుల సందర్భంగా ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాలలో అర్హులైనవారికి చీరల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారా కూడా ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.
 
# '''2017:''' 2017 సంవత్సరంలో 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేశారు.
# '''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.<ref>{{Cite web|url=http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/,%20http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|title=Bathukamma Sarees: రేపట్నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ… - Telugudunia|date=2020-10-08|website=www.telugudunia.in|language=en-US|url-status=live|archive-url=http://web.archive.org/web/20220120163839/http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు