ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 508:
 
నమస్కారం గురువు గారు, ఇటీవల నర్రా ప్రవీణ్ రెడ్డి అనే పేరుతో చాలా సార్లు నాతోపాటు మరొకరు కూడా పేజీ సృష్టించడానికి ప్రయత్నించారు కానీ మీరు దానిని తొలగించడం జరిగింది. ఈ విషయమై వికీపీడియాలో వ్రాయడంలో అపార అనుభవం కలిగిన ప్రణయ్ రాజ్ వంగరి గారిని సంప్రదించడం జరిగింది. కానీ మాకు స్పష్టమైన అవగాహన రాలేదు, దయచేసి ఆ పేజీని అవసరమైన దిద్దుబాట్లతో పునరుద్ధరించడం కానీ లేదంటే ఆ పేజీని మీరు తొలగించకుండా ఉండటానికి అత్యవసరమైన విషయాలను మాకు తెలియజేయగలరని లేదంటే మీకున్న అపార అనుభవంతో సరైన పద్దతిలో ఆ పేజీని మీరే సృష్టించగలరని అభ్యర్ధిస్తున్నాము. ఒకవేళ నర్రా ప్రవీణ్ రెడ్డి అనే యువ రచయిత తన పేరుతో వికీపీడియాలో పేజీని కలిగిఉండటానికి అనర్హుడని మీరు భావిస్తే మాకు స్పష్టం చేయగలరు తద్వారా మేము పదే పదే ఈ పేజీని సృష్టించడానికి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటాము. ధన్యవాదాలు. intellectualboy 11:53, 27 జనవరి 2022 (UTC)
:intellectualboy గారూ, నమస్కారం. నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. నేను ఆ పేజీని సత్వరమే తొలగించడానికి కారణం ఏంటంటే, కాపీహక్కుల ఉల్లంఘన. navatelangana.com /article/sopathi/1108031 అనే పేజీలో ఉన్న భాగాలను ఉన్నదున్నట్టుగా వికీలో పెట్టారు. అది కాపీ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. నేను ఆ వ్యాసాన్ని చర్చ లేకుండా తక్షణమే తొలగించడానికి ప్రధాన కారణం ఇది.
:ఆ వ్యాసం తిరిగి రాయాలంటే మీరు కింది విషయాలు గమనంలో ఉంచుకోవాలి:
 
# ఆ వ్యక్తికి తగు విషయ ప్రాముఖ్యత ఉందని నిర్థారించుకోండి. [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత]], [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు)]], [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు)]] చదవండి.
# మూల వ్యాసాన్ని స్వేచ్ఛా లైసెన్సు కింద విడుదల చేసినా సరే, ఉన్నదున్నట్టుగా కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యకూడదు. మీ స్వంత మాటలతో, వికీశైలికి అనుగుణంగా రాయాలి. వికీది విజ్ఞాన స్సర్వస్వ శైలి.. ఇందులో వర్ణనలు, పొగడ్తలు, సందిగ్ధతతో కూడిన వాక్యాలు లాంటివేవీ ఉండవు. మన దృక్కోణాలు ఇక్కడ రాయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను.. "'''''ఆయన చిరుత ప్రాయం లోనే కలం పట్టి మెరికల్లాంటి కవితలతో సాహిత్య ప్రపంచాన మెరుపులు మెరిపించారు.'''''" అనే వాక్యం ఒక పత్రిక లోని వ్యాసం లోనో, సామాజిక మాధ్యమం లోనో అయితే బానే ఉంటుంది గానీ, అది విజ్ఞాన సర్వస్వ శైలి కాదు. ఇదే వాక్యాన్ని వికీలో "'''''అతడు 14 వ యేటనే ఫలానా కవిత రాసి విమర్శకుల మెప్పు పొందాడు [1]'''''" అని రాస్తాం. ఇక్కడ [1] అనేది మూలం. "14 వ యేట కవిత", "విమర్శకుల మెప్పు" అనేవి మనం అల్లిన కథనం కాదని, వాటికి ఆధారం ఇదీ అని మనం చెబుతున్నామన్నమాట. వికీలో కేవలం వాస్తవాలే రాస్తాం, అవసరమైన ప్రతిచోటా సముచితమైన మూలాలనిస్తాం. మూలాల గురించి తెలుసుకునేందుకు [[వికీపీడియా:మూలాలు]], [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు]], [[వికీపీడియా:మూలాలను ఎప్పుడు ఉదహరించాలి]] అనే లింకులు చూడండి.
:ఈ విషయమై ఏమైనా సందేహాలుంటే నన్ను అడగండి, నాకు తెలిసినంతలో వివరిస్తాను.
:పోతే.., ఇదే వ్యక్తి గురించి వ్యాసం రాయడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది మూడోది. ప్రతీ సారీ ఏదో ఒక దోషం జరుగుతోంది. ఈసారి కట్టుదిట్టంగా తయారు చేద్దాం. అందుకు నేనూ సాయపడతాను. అయితే, ముందుగా విషయ ప్రాముఖ్యత ఉందని నిర్థారించుకోండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:29, 27 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు