అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

2,756 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
+ తెలుగులో రాయడం గురించిన పాఠ్యం, వెన్న నాగార్జున, +మూలం
(→‎తొలి అడుగులు: ఫాంట్ల గురించి మరి కొంత)
(+ తెలుగులో రాయడం గురించిన పాఠ్యం, వెన్న నాగార్జున, +మూలం)
 
=== కంప్యూటరులో తెలుగు రాయడం ===
కంప్యూటరులో తెలుగులో రాయడం అనేది తెలుగు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. తెలుగు రాసేందుకు అనుగుణమైన పరికరాలు, కీబోర్డు లేఔట్లూ రావడంతో ఈ సమస్య పరిష్కారం కావడం మొదలైంది. తెలుగు టైపింగు నేర్చుకునే అవసరం లేకుండానే రోమను లిపిలో రాస్తే తెలుగు లోకి మార్చేసే పరికరాలు రావడం ఈ పరిష్కారాన్ని వేగవంతం చేసింది. అలాంటి పరికరాల్లో మొదటిది "పద్మ". ఈ పద్మ పరికరాన్ని తయారుచేసినది [[వెన్న నాగార్జున]]. ఈ పరికరాన్ని అప్పట్లో అందుబాటులో ఉన్న జియోసిటీస్‌.కాం సైటులో పెట్టి అందరికీ ఉచితంగా వాడుకునేందుకు అందుబాటులో ఉంచాడు. ఒక పెట్టెలో రాయదలచిన పాఠ్యాన్ని రోమను లిపిలో రాసి మార్చమని ఒక బొత్తాన్ని నొక్కితే, తెలుగు పాఠ్యం కనిపించేది. ప్రస్తుతం ఈ పద్మ పరికరం oocities.org అనే సైటులో అందుబాటులో ఉంది. నాగార్జున ఈ విధంగానే కాకుండా, వికీపీడియా రూపంలో మరో విధంగా కూడా తెలుగు విస్తరించడానికి దోహదం చేసాడు. తెలుగుకు కూడా ఒక వికీపీడియా ఉండాలని, వికీమీడియా గ్రూపు సైట్లలో భాగంగా తెలుగు వికీపీడియాను నాగార్జునే స్థాపించాడు.
 
== ఫాంట్ల రంగంలో ==
మొదట్లో తెలుగు ఫాంట్లు యుణికోడులోయూనీకోడులో కాకుండా వేరే ఎన్‌కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఒక ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]] వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్‌సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి దించుకోవాలి. అప్పుడే ఆ తెలుగు అక్షరాలు కనిపించేవి. లేకపోతే అర్థం కాని బొమ్మలు, పెట్టెలూ కనిపించేవి. యూనికోడ్ ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అయితే ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు ఈనాడు తమ స్వంత ఫాంట్లనే వడడం చేత, ఆ సైటులో తెలుగు చూడాలంటే వారి ఫాంట్లను దించుకోక తప్పేది కాదు. <ref>{{Cite web|url=https://answers.microsoft.com/en-us/windows/forum/all/i-am-unable-to-copy-text-from-wwweenadunet-site/46f064b1-9dd3-4b59-b90b-118c8da4d801|title=I am unable to copy text from www.eenadu.net site into notepad. why may I know the reason. can you please help me out.|website=answers.microsoft.com|language=en-US|access-date=2022-01-28}}</ref>
 
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457921" నుండి వెలికితీశారు