భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కవి-కాలము: clean up, typos fixed: సాధారణముగా → సాధారణంగా
చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (6)
పంక్తి 25:
అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దానిని అతడు తన ప్రియభార్యకు ఇచ్చెను. ఆమె దానిని తాను భుజింపక, తన జారునకును, అతడు తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను." అన్న జన ప్రతీతిని ఇచట తడవి యున్నాడు గాని, దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణంగా ప్రసిద్ధ పురుషులను గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథలను ఎన్నింటినో కల్పించుటయు, వాటిని అలాగే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. ఇదియొక గ్రుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమే కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలమును నిర్ణయించుటకు తగినంత విశదముగా అతనిని ప్రశాసించిన వారును లేరు.
 
అట్లుండినను ప్రబలమైన ఆధారాంతరముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంథము ఉంది. ఇది క్రీసా.శ. 531-579 ప్రాంతముల పారసీక దేశమును పాలించిన యొకానొక పాదుషా ప్రోత్సాహమున రచియింపబడిన గ్రంథము. దీనికి మూలము మన సంస్కృత పంచతంత్ర మనుట సర్వాంగీకరింపబడిన విషయము. కనుక పంచతంత్రము అధమ పక్షము క్రీసా.శ. ఆరవ శతాబ్దారంభము నాటికే ప్రాచుర్యమందియుండెననుట కెలాంటి సంశయమును లేదు. పంచతంత్ర మా మూలాగ్రము స్వతంత్ర మైన రచన కాదు. నాటికి ప్రశస్తము లైయుండిన గ్రంథరాజము లనేకముల నుండి బహుళముగా నుదాహరణముల గైకొనియున్నది. దాని కాధారములగు గ్రంథములలో ఈ నీతి శతక మొకటి. ఇందుండి యొక శ్లోకము " గజభుజఙ్గ విహఙ్గమ బంధనం శశిదివాకరయోర్గ్రం హపీడనమ్; మతిమతాం చ విలోక్య దరిద్ర్క్వ తాం విధిరహో బలవాని తిమే మతిః" (చూడండి. 85 నీతి శతకం) అను శ్లోకమందు లోనికి గ్రహింపబడియున్నది.
 
ఈ యుదాహరణమే పారశీక గ్రంథమునందును గలదు. కనుక నీతి శతక కర్త క్రీసా.శ. 500 కు పూర్వమే యుండెననుట స్థిరము. అనగా కవికాలమును అయిదవ శతాబ్ది కీవలికి లాగుటకు వీలులేదు.
 
మరొక మతము భర్తృహరి క్రీసా.శ. 7 వ శతాబ్దము వాడనుట. దానికి భర్తృహరి కాళిదాసీయ మగు నొక శ్లోకమును - "భువన్తి నమ్రాస్తర వః పలోద్గమైర్న వాంబుభిర్దూరవిలంబినో ఘనాః, అనుద్దతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం." (శాకుం. 5 అం. శ్లో.12) అనుదానిని (చూ. శ్లో.61 భర్తృ) స్వగ్రంథమున నుదాహరించుటయు, కాళిదాసు 6 వ శతాబ్ది వాడను మతమునే యాధారములు. దీని కాక్షేపణమిది. కాళిదాసు కాలమే చాల వివాదగ్రస్తమై యుండినది. కాని చాలినన్ని ప్రమాణములను గొని అతడు క్రీసా.శ. ప్రథమ శతాబ్దమువాడని పండితులు నిశ్చయించియున్నారు. కావున నీవాదము నిలువజాలదు. ఇంకనొక విషయము. ఇత్సింగను చైనా యాత్రికుడు యాత్ర చేయుటకు ఈ దేశానికి 7 వ శతాబ్దాంతమున వచ్చియుండి భర్తృహరి తాను వచ్చుటకు పూర్వము నలువది యేండ్ల క్రితము గతించినట్లు వ్రాసి యున్నాడు. ఈ భర్తృహరి వైయాకరణి. ఆధునిక విద్వాంసుల మతమున శతక కవియు, వైయాకరణియు భిన్నులు. ఈ మతమును గూడ నేటిదనుక నాక్షేపించినవారొక్కరు లేరు. కనుక నేడవ శతాబ్దమై యున్నది. భర్తృహరి తన గ్రంథమున నెచటను సమకాలిక కవులనో, సమకాలిక సంభవములనో తడవి యుండని కారణము చేతను, ఇతరు లెవరు నాతనిపేరు నుదాహరింపని కారణమున సాంప్రదాయికాభిప్రాయములకు విరుద్ధముగా నేలాటి ప్రబల ప్రమాణములును గన్పట్టణందు వలనను పండిత ప్రతీతినే యనుసరింపవచ్చును.
 
<u>పై విషయ వర్యాలోచన ఫలితముగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మద్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.</u>
పంక్తి 50:
{{వ్యాఖ్య| Numbers of wise sayings have from time immemorial, been constantly quoted in conversation. Many, thus orally current, were of such antiquity that to settle their authorship was impossible. But occasional attempts were made to give permanence to the floating wisdom of the day. by stringing, like beads on a necklace, representing a separate topic, and the authorship of a whole series being naturally ascribed to men of known wisdom like '''Bhartrihari''', Chanakya, much in the same way as the authorship of the puranas and the Mahabharata was referred to the sage Vyasa.|}}
==సుభాషిత త్రిశతి - వివిధ భాషలలో అనువాదాలు==
ఇటీవల సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైనవి గోపీనాథుడు, టానీ పండితుడు, బి.హెచ్. వార్తాం పండితుడు, పీటర్సన్ అనువారి రచనలు. వీరిలో కొందరు విదేశీయులు. అన్నియు నాంగ్ల భాషలోనివి. వీనియన్నింటికన్నా మిన్నయై కవి హృదయమును వ్యాఖ్యాతృ భావమును చక్కని పరిశీలన, విమర్శనములకు గురిచేసి రచించినట్టిది శ్రీ గోపాలాచార్ల ఆంగ్లానువాద వ్యాఖ్యలు. క్రీసా.శ. 1654 వ సం. నాటికే అబ్రహాము రోజరు దీనిని డచ్చి భాషలోనికి పరివర్తనము గావించెను. ఆంధ్రానువాదకులలో [[ఎలకూచి బాలసరస్వతి]], [[పుష్పగిరి తిమ్మన]], [[ఏనుగు లక్ష్మణ కవి]] యనువారు ముఖ్యులు.
 
ఆంధ్రానువాదకులు మువ్వురిలో పుష్పగిరి తిమ్మన అర్వాచీనుడు; ఇతనికి గొంత పూర్వుడు ఏనుగు లక్ష్మణకవి. ఈ యిరువురకును ముందటివాడు ఎలకూచి బాలసరస్వతి.
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు