ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''ప్రోటిస్టా''' (Protista) జీవుల రాజ్యంలో ఏకకణ నిజకేంద్రక [[జీవులు]] ఉన్నాయి. వీనిలో కశాభయుత జీవులు, డయాటమ్ లు, డైనోఫ్లాజెల్లేట్ లు, జిగురు బూజులు, జుఫ్లాజెల్లేట్ లు, సార్కోడైన్ లు, సీలియేట్ లు, స్పోరోజోవన్ లు, ప్రోటోజోవన్ లు, ప్రాథమిక వృక్షాలు, ప్రాథమిక శిలీంద్రాలు చేరి వున్నాయి.
 
జీవావరణ వ్యవస్థలో జలచరాలుగా నివసించే ఈ జీవులు వృక్ష ప్లవకాలుగా (ఉత్పత్తిదారులు), జంతు ప్లవకాలుగా (ప్రాథమిక వినియోగదారులు) ఉంటాయి. జిగురు బూజులు కణకుడ్య రహిత, కణకుడ్య సహిత జీవులకు మధ్యస్థంగా ఉంటాయి. శాఖీయ దశ కుడ్యరహితంగాను, ప్రత్యుత్పత్తి దశలు కుడ్యసహితంగాను ఉంటాయి. పోషణ పూతికాహార భక్షణ, జాంతవ భక్షణ పద్ధతులలో జరుగుతుంది. కాంతి లభించే సమయంలో పాదపీయ భక్షణ, కాంతి లేనప్పుడు పూతికాహార భక్షణ జరుపుకొనే యూగ్లీనా వంటి జీవులను మిశ్రమ పోషకాలు అంటారు. సహజీవనం గడిపే ప్రోటిస్ట్ లు చెదపురుగుల వంటి కీటకాల ఆంత్రనాళంలో ఉంటాయి.
 
కణనిర్మాణ రీత్యా ప్రోటిస్ట్ లు జీవద్రవ్యాన్ని లోపలి కొన్ని కణాంగాలను ప్రమాణ త్వచ నిర్మాణం గల ప్లాస్మా పొర ఆవరించి ఉంటుంది. కేంద్రక త్వచం స్పష్టంగా ఉంటుంది. హిస్టోన్ లతో కూడిన డి.ఎన్.ఏ. జన్యు పదార్ధంగా ఉంటుంది. కొన్ని కణాంగాలు వుంటాయి. అలైంగికంగాను, లైంగికంగాను ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు. అభివృద్ధిలో పిండం ఏర్పడదు.
 
==వర్గీకరణ==
జీవావరణ శాస్త్రరీత్యా ప్రోటిస్టాలను మూడు సమూహాలుగా విభజించారు:
*'''స్వయంపోషక ప్రోటిస్ట్ లు.''': ఉ. [[శైవలాలు]], డయాటమ్ లు, యూగ్లీనాయిడ్ లు
*విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు. ఉ. శిలీంద్ర ప్రోటిస్ట్లు, [[జిగురు బూజులు]]
*వినియోగదారులైన ప్రోటోజోవన్'''విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు.''': ఉ. శిలీంద్ర ప్రోటిస్ట్లు, [[ప్రోటోజోవాజిగురు బూజులు]]
*'''వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు''': ఉ. [[ప్రోటోజోవా]]
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు