శ్రీరామోజు హరగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== సాహిత్య ప్రస్థానం ==
హరగోసాల్ తండ్రి విశ్వనాధం కవి, సాహితీవేత్త. తన తండ్రి నుంచి స్ఫూర్తిపొందడంతోపాటు విద్యార్థిగా ఉన్నప్పుడే [[తిరునగరి రామానుజయ్య]] దగ్గర వచనకవిత్వంలో మెళకువలు నేర్చుకున్నాడు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నాడు. అతను రాసిన మొదటి కవిత '''దానిమ్మపూవు''' ఉజ్జీవనలో ప్రచురితం అయింది. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. అతను రాసిన కవిత్వాన్ని 1991లో మట్టిపొత్తిళ్ళు, 2006లో మూలకం కవితా సంపుటులుగా ప్రచురించాడు. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాడు. అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాడు. నెలా నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాడు. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య, సాంస్కృతిక, క్రీడా, బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు, గల్పికలు, నాటికలు, కథలు, పాటలు రాసాడు. అతని పాటల్ని '''గాలి అలలమీద నీ నవ్వులు''' అనే పాటల ఆల్బంగా తెచ్చాడు.<ref>{{Cite web|date=2022-09-08|title=శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం|url=https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122171290|archive-url=https://web.archive.org/web/20220908040140/https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122171290|archive-date=2022-09-08|access-date=2022-09-08|website=EENADU|language=te}}</ref>
 
=== కవితా సంకలనాలు ===