చక్రపాణి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==సంక్షిప్త చిత్రకథ==
చక్రపాణి (సి.ఎస్.ఆర్.) కి ఒక కొడుకు మరియు ఇద్దరు కుమార్తెలు. కొడుకు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూతుర్లలో ఎవరు ముందుగా మనవణ్ణి ఇస్తే వారికి లక్ష రూపాయలు ఇస్తానని చక్రపాణి ప్రకటిస్తాడు. అతని మొదటి కుమార్తెకు ఆడపిల్ల. రెండవ కుమార్తె మాలతి (భానుమతి) మరియు ఆమె భర్త చలం (అక్కినేని). మాలతి ఎలాగైనా లక్ష రూపాయలు సంపాదించాలని స్నేహితురాలు మనోరమ (సూర్యకాంతం) సలహాపై ఎదురింట్లో ఉన్న బాబును తీసుకొచ్చి తండ్రికి తన కొడుకుగా చెబుతుంది. భర్త పొరుగూరు వెళ్ళి తిరిగి వచ్చేలోగా మరొకర్ని (అమర్ నాథ్) భర్తగా కుదురుస్తుంది. అసలు భర్త చలం వచ్చాక అతన్ని వంటవానిగా పరిచయం చేస్తుంది. ఇద్దరు భర్తలకు మధ్య గందరగోళం, ఘర్షణ మూలంగా లక్ష కోసం కొంతకాలం ఓర్చుకోమని చలాన్ని కోరుతుంది. ఇంతలో ఆ పసివాడు ఆమె కొడుకు కాదని, ఏనాడో దూరమైన తన కొడుకు సంతానం అని తెలుస్తుంది. కథంతా కామెడీగా కొనసాగుతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి_(సినిమా)" నుండి వెలికితీశారు