మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
}}
 
'''ఎం. ప్రభాకర రెడ్డి''' గా ప్రసిద్ధులైన '''డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి''' ([[అక్టోబర్ 8]], [[1935]] - [[నవంబర్ 26]], [[1997]]) [[తెలుగు]] సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]] చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నట్టించిన నటుడు, దర్శకుడు, [[నిర్మాత]] కూడా. [[కార్తీక దీపం]] వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు.<ref name="డాక్టర్ యాక్టర్... తెలంగాణ తేజం">{{cite news |last1=Chauhan |first1=Ramesh |title=డాక్టర్ యాక్టర్... తెలంగాణ తేజం |url=https://www.manatelangana.news/its-all-about-m-prabhakar-reddy-telugu-actor/ |accessdate=26 November 2022 |work=Mana Telangana |date=31 December 2016 |archiveurl=https://web.archive.org/web/20221126085756/https://www.manatelangana.news/its-all-about-m-prabhakar-reddy-telugu-actor/ |archivedate=26 November 2022}}</ref>
 
ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్‌గానే కాకుండా అనేక పాత్రల్లో నటించాడు ప్రభాకర రెడ్డి. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా. ఓ వైపు వైద్యవృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్‌లోనే ఉండేది. 90ల మొదట్లో దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దానికోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చాలా మంది ఎంతో కృషి చేసారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి '''''ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ''''' అంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసాడు. అందుకనే [[హైదరాబాదు]] లోని మణికొండలో ఈయన స్మారకార్ధం '''డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి'''కి ఈయన పేరుపెట్టారు.