బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

→‎పండుగ కథ: పూర్వపు సవరణకు ఆధారాలు విషయాన్ని ధ్రువీకరించ లేదు. పొందుపరిచిన సమాచారానికి వర్గాలని ఆపాదించినందున మరియు చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన, సమాచారాన్ని యధాస్థానము లోకి తీసుకురావడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
==పండుగ కథ==
 
బతుకమ్మ చరిత్ర పై రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.పూర్వం భట్టు నరసింహ అనే భట్ట రాజులు చోళదేశాన్ని పాలించేవాడు.ఆయన చాలా ధర్మాత్ముడు.అందువల్ల ధర్మాంగుడు అని కూడా పిలిచేవారు.అతని భార్య సత్యవతి. ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధు మిత్రులను కోల్పోయి, భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన శ్రీమహాలక్ష్మీదేవిని మనసున తలచి, గొప్ప తపస్సు చేసాడు. కొంత కాలానికి శ్రీమహాలక్ష్మీదేవి కరుణించి, సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది.తల్లీ! మమ్ములను కరుణించి, నీవే మా కుమార్తెగా జన్మించాల'ని ఆయన వేడుకున్నాడు. అందుకు శ్రీమహాలక్ష్మీదేవి సంతోషించి, తథాస్తు అన్నది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీమహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూసి మునులు, ఋషులు ఎంతో సంతోషించి, అనారోగ్యాలు లేకుంగా బాగా ' బతుకమ్మా అని దీవించారు. ఆనాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలువసాగారు. బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్నిసంపాదించి,రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖసంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు.<ref>{{Cite book|title=తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష ప్రథమ భాగం|location=హైదరాబాదు|pages=116}}</ref><ref>{{Cite news|title=బతుకమ్మ చరిత్ర|work=ఆంధ్రప్రభ}}</ref>
===మరొక కథనం===
[[తెలంగాణ]] ప్రాంతాన్ని [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట]] రాజులు పరిపాలించేవారు. వారి వద్ద [[వేములవాడ]] చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.
 
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు