ఆర్.ఆర్.కేశవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
చి AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
పంక్తి 23:
ఇతడు కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా రుద్రపట్టణ గ్రామంలో [[1913]], [[మే 27]]వ తేదీన రామస్వామయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తాత వెంకటరామయ్య వాగ్గేయకారుడు. ఇతడు వాయులీన విద్వాంసుడైన తన తండ్రి రామస్వామయ్య వద్ద మొదట సంగీతం నేర్చుకున్నాడు. తరువాత బిడారం కృష్ణప్ప వద్ద శిక్షణ పొందాడు. ఇతడు గాత్రంలోను, వయోలిన్ వాద్యంలోను సమానమైన నైపుణ్యం సాధించాడు. [[తిరుమకూడలు చౌడయ్య]] కనిపెట్టిన ఏడుతీగల వయోలిన్ ఉపయోగించడంలో పేరు గడించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతం, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.
 
ఇతడు 1934లో బెంగళూరులో స్థిరపడి తన గురువు పేరిట "గానవిశారద బిడారం కృష్ణప్ప స్మారక సంగీత విద్యాలయా"న్ని స్థాపించి వందలాది మంది శిష్యులను విద్వాంసులుగా తయారు చేశాడు. ఇతని శిష్యులలో [[టి.రుక్మిణి]], భువనేశ్వరయ్య, ఎం.ఎస్.కృష్ణవేణి, అనూర్ రామకృష్ణ,<ref>{{cite news|title=R.R. Keshava Murthy passes away|url=http://www.hindu.com/2006/10/25/stories/2006102502970400.htm|accessdate=4 December 2010|newspaper=The Hindu|date=25 October 2006|archive-date=24 నవంబర్నవంబరు 2006|archive-url=https://web.archive.org/web/20061124090440/http://www.hindu.com/2006/10/25/stories/2006102502970400.htm|url-status=dead}}</ref>మీనాక్షి రవి, జ్యోత్స్న శ్రీకాంత్, మైసూర్ సంజీవకుమార్<ref>{{cite web|last=herald|first=deccan|title=Jyotsna Srikanth|url=http://www.deccanherald.com/content/153581/a-blend-beats.html|publisher=Deccanherald|accessdate=11 July 2011}}</ref>, నళినమోహన్, జ్యోత్స్న మంజునాథ్, నిఖిల్ జోషి, నాగరత్న సదాశివ మొదలైన వారున్నారు. ఇతడు కన్నడ భాషలో సంగీత సంబంధమైన అనేక గ్రంథాలు రచించాడు. వాటిలో "బాలశిక్ష", "వాగ్గేయకారర కృతిగళు", "భారతీయ వాగ్గేయకారరు", "రాగలక్షణ మత్తు రాగకోశ", "లక్ష్య లక్షణ పద్ధతి", "సంగీత లక్ష్య విజ్ఞాన", "హిందుస్తానీ సంగీత రాగకోశ", "మేళరాగమాలిక" మొదలైనవి ఉన్నాయి. వయోలిన్ గురించి అనేక పత్రాలు సమర్పించాడు.<ref>{{cite web|last=Swarasindhu|title=RR Keshavamurthy|url=http://www.swarasindhu.in/swarasindhu/showDetails.do?table=Artist&id=117|work=Web Research and Articles|publisher=Swarasindhu|url-status=dead|access-date=3 ఏప్రిల్ 2021|archive-date=21 మార్చి 2012|archive-url=https://web.archive.org/web/20120321052911/http://www.swarasindhu.in/swarasindhu/showDetails.do?table=Artist&id=117}}</ref>
 
==పురస్కారాలు, బిరుదులు==
*వీణ శేషణ్ణ స్మారక పురస్కారం
*199లో కనక పురందర ప్రశస్తి<ref>{{cite web|title=Kanaka Purandara Award Winners p521|url=http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20XIII%20CULTURE.pdf|work=Karnataka Handbook 2010|publisher=Government of Karnataka|url-status=dead|access-date=3 ఏప్రిల్ 2021|archive-date=8 అక్టోబర్అక్టోబరు 2011|archive-url=https://web.archive.org/web/20111008075154/http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20XIII%20CULTURE.pdf}}</ref>
*[[సంగీత నాటక అకాడమీ అవార్డు]]<ref>{{cite web|title=Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)|url=http://www.sangeetnatak.org/sna/awardeeslist.htm#CarnaticVeena|publisher=Sangeet Natak Akademi|url-status=dead|access-date=3 ఏప్రిల్ 2021|archive-date=17 ఫిబ్రవరి 2012|archive-url=https://web.archive.org/web/20120217185616/http://www.sangeetnatak.org/sna/awardeeslist.htm#CarnaticVeena}}</ref>
* సంగీత సాహిత్య శిరోమణి
"https://te.wikipedia.org/wiki/ఆర్.ఆర్.కేశవమూర్తి" నుండి వెలికితీశారు