మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

ఎర్ర లింకులు తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.3
పంక్తి 23:
 
== థీమ్స్, ప్రభావాలు ==
మోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19వ శతాబ్ది ఉత్తర మెక్సికోలో ఈ పాత్ర జానపద నాయకుని పాత్రగా రూపాంతరం చెంది పలు సాహసగాథలకు ముఖ్యమైన దినుసు అయింది.<ref name="Malone1">Malone, J., p. 1.</ref> 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ ''వెల్డ్ వెస్ట్ షోలు'' ప్రాచుర్యం పొందాయి.<ref>Malone, J., p. 82.</ref> 1920ల నుంచి నేటివరకూ ఆంగ్లంలో పలు కౌబాయ్ సినిమాలో వచ్చాయి. వీటిలో కౌబాయ్ లు నెగిటివ్ గానూ, పాజిటివ్ గానూ కూడా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో కౌబాయ్ లు గ్యాంగ్ స్టర్లుగానూ, మరికొన్నిటిలో దేశభక్తి, సాహసం, ధైర్యం వంటి గుణాలతో కౌబాయ్ కోడ్ వంటి సద్లక్షణాలతోనూ కనిపిస్తారు. మొత్తానికి ఆంగ్ల చిత్రాల్లో కౌబాయ్ ఓ ప్రత్యేకమైన జానర్ గా రూపుదిద్దుకుంది.<ref>[http://geneautry.com/geneautry/geneautry_cowboycode.html "Gene Autry's Cowboy Code" © Autry Qualified Interest Trust.] {{Webarchive|url=https://web.archive.org/web/20100917062349/http://www.geneautry.com/geneautry/geneautry_cowboycode.html |date=2010-09-17 }} Web page accessed February 3, 2009.</ref><br />
ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత [[ఆరుద్ర]] చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్. ఇలాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు. [[బొబ్బిలి యుద్ధం]] కాలంలో బ్రిటీష్ వారు అమరవీడు అనే సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడిచేసిన రోజుల్లో కథ ప్రారంభమవుతుంది. ఆ అమరవీడు సంస్థానపు నిధి కోసం జరిగే అన్వేషణ [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]], [[కర్నూలు]] రాజ్యాల వరకూ సాగుతుంది. ప్రతినాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను తెలుగు పట్టణాల పేర్లు కలసివచ్చేలా పెట్టారు. విదేశీ సంస్కృతిలోని నేపథ్యానికి తెలుగు వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇవి.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" /><br />
సినిమాలో [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] పోషించిన పాత్ర ప్రముఖ ఆంగ్ల కౌబాయ్ చిత్రం ''గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ'' సినిమాలోని అగ్లీ పాత్రను ఆధారం చేసుకుని తయారుచేశారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ" />
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు