అభిజ్ఞాన శాకుంతలము: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణ
చి విస్తరణ
పంక్తి 1:
 
 
[[Image:Shakuntalam.jpg|thumb|175px|శకుంతల ఆగి వెనుకకు దుష్యంతుని వైపు చూచు దృశ్యము, రాజా రవివర్మ (1848-1906)]]
'''అభిజ్ఞాన శాకుంతలము''' మహాకవి [[కాళిదాసు]] విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. దేవలోకములో నర్తకి అయిన ఊర్వశి, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి మరియు పెంచబడినది కావున శకుంతల అయినది.
==కథా సంగ్రహం==
ఒక రోజు హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు వేటకు వెళతాడు. ఒక జింకను అనుసరిస్తూ కణ్వ మహర్షి ఆశ్రమం సమీపానికి వస్తాడు. కణ్వ మహర్షి దత్తత తీసుకుని పెంచుతున్న మేనకా, విశ్వామిర్తుల పుత్రికయైన, అత్యంత సౌందర్యరాశి యైన శకుంతల అతని కంటపడటం జరుగుతుంది. ఆమె ఆ సమయంలో కొన్ని తుమ్మెదల బారిన పడి ఉంటుంది. రాజు అక్కడికి వచ్చిన సంగతి గమనించని ఆమె పరిచారిక ఒకరు పరిహాసంగా ''దుష్యంతుడు ఈ భూభాగాన్ని పరిపాలిస్తుండగా నీలాంటి అందకత్తెను తేనెటీగలు భాధించడమేమిటి?'' అని అంటుంది.
 
దాన్ని విన్న దుష్యంతుడు ఆమెను తానే స్వయంగా రక్షించడానికి పూనుకుంటాడు. కణ్వుడు ఆ సమయానికి ఆశ్రమంలో లేనందున శకుంతల రాజును ఆదరిస్తుంది.
==ఇవి కూడా చూడండి==
*[[శకుంతల]]
"https://te.wikipedia.org/wiki/అభిజ్ఞాన_శాకుంతలము" నుండి వెలికితీశారు