బి.జయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బి.జయమ్మ/ '''గుబ్బి జయమ్మ''' ([[1915]] - [[1988]]) ప్రముఖ [[కన్నడ సినిమా]] మరియు రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన [[గుబ్బి వీరన్న]] నాలుగవ భార్య<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm</ref>. జయమ్మ, [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వము వహించిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] తో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.
 
జయమ్మ 1915లో [[కర్ణాటక]]లోని [[చిక్‌మగళూరు]] లో జన్మించింది. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికి తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.<ref>http://www.indianetzone.com/30/b._jayamma_indian_theatre_actress.htm</ref>
జయమ్మ 1931లో రాఫెల్ అల్గియాట్ అనే విదేశీయుడు దర్శకత్వం వహించిన మూకీ చిత్రం ''హిజ్ లవ్ అఫైర్'' మరియు 1932లో గుబ్బివీరన్నతో కలిసి [[వై.వి.రావు]] దర్శకత్వం వహించిన ''హరి మాయ'' అనే మూకీ చిత్రంలో నటించింది.
1940లలో తెలుగు సినిమా రంగములో కూడా బాగా పేరుతెచ్చుకున్న జయమ్మకు కన్నడ సినిమా రంగములో అంతకంటే పెద్ద పేరు ఉన్నది. ఈమె తెలుగులో స్వర్గసీమ, త్యాగయ్య, గుళేబకావళి కథ, బ్రహ్మరధం మొదలైన నాలుగు సినిమాల్లో నటించింది. ఈమె మంచి గాయని కూడా. స్వర్గసీమలో కొన్ని పాటలు పాడింది.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/బి.జయమ్మ" నుండి వెలికితీశారు