కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==ఆలయ చరిత్ర==
[[భవిష్యోత్తర పురాణం]] లో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి [[పుష్కరిణి]]లో స్నానమాచరించినట్లు చెప్పబడినది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడని తరువాత కాలంలో [[జనమేజయ చక్రవర్తి]] పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయమునందలి ముర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలొ లభ్యమైన [[శాసనం]] ప్రకారం ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1402 (క్రీ.శ.[[1480]])లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సాంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే [[సాళువ నరసింహ రాయలు]].
 
==మూలాలు==