శంతనుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:શાંતનુ, id:Santanu, kn:ಶಂತನು
వర్గాలు చేర్పు
పంక్తి 4:
==గంగాదేవి==
ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహ మాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత [[భీష్ముడు|భీష్ముడి]]గా పేరుగాంచాడు.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
 
[[en:Santanu]]
"https://te.wikipedia.org/wiki/శంతనుడు" నుండి వెలికితీశారు