"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

4,492 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
==చిత్రించే విధానం==
మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శించే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు. దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు. సుదీర్ఘమైన ఈ కలంకారీ విధానంలో ఇది మొదటిమెట్టు. ఈవిధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్ వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తిచేస్తారు.
#వస్త్రాలను శుభ్రం చేయడం
 
#వెదురు కలాల్ని సిద్ధం చేసుకోవడం
కలంకారీ చిత్రకారుల హస్తకళా కౌశలాన్ని చూడడం కనులకు విందు. కలాన్ని వ్రేళ్ళతో పట్టుకుంటాడు. కావలసిన రంగులో ముంచిన చిన్న గుడ్డనుగానీ, దూదినిగానీ, కలంలో పెట్టి వ్రేలితో నొక్కుతూ కావలసినంత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ పై రేఖా చిత్రాల మీద వర్ణం వేస్తాడు. నిపుణుల చేతిలో సంపూర్ణంగా చిత్రించిన చిత్రాలు చైతన్యవంతంగా తయారవుతాయి. రంగులు కన్నులకు కొట్టవు. నాజూకైన వర్ణాలు అరిమృదువుగా, కంటికి ఇంపుగా, సమరస భావంతో చల్లగా ఉంటాయి. దిజైన్లలో, రంగులో మచిలీపట్టణం అద్దకాలను మించినవి లేవు. పురాతన కాలం నుంచీ ఇవి ఎంతో ప్రసిద్ధిని పొందాయి. 1658-1664 సంవత్సరాల మధ్య ఒక ఫ్రెంచి యాత్రికుడు ఫ్రాంకాయిన్స్ బెర్నీర్ మొగలాయి చక్రవర్తులు టెంటులకు ఉపయోగించే బట్టను గురించి వ్రాస్తూ పైల ఎర్ర రంగు గలిగి లోతట్టు మచిలీపట్టణం పెన్‌తో చిత్రింపబడిన అందమైన అద్దకపు బట్టలను జోదిస్తారు అని వర్ణించాడు. ఆంధ్ర దేశంలో కలంకారీ కళ అంత ఖ్యాతిని గడించి ప్రపంచ కలంకారీ చరిత్రలో ఓ విశిష్ట స్థానాన్ని పొందింది.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Kalamkaree_addakalu.htm</ref>
#బొగ్గుతో స్కెచ్ గీసుకోవడం
 
#నల్ల రంగుతో బొమ్మలను గీయడం
#సహజ రంగులను అద్దడం
==ప్రముఖ కలంకారీ కళాకారులు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/426353" నుండి వెలికితీశారు