పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Poola Rangadu; cosmetic changes
పంక్తి 25:
}}
 
'''పూలరంగడు''', 1967లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. అక్కినేనిని మేటి కధానాయకునిగా నిలబెట్టిన ఈ సినిమా అన్న చెళ్ళెళ్ళ అనుభందంతో సాగుతుంది. చెల్లెలి కోసం కష్టించే అన్నగా [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించాడు.
 
== కధ ==
 
''పూలరంగడు'' అనబడే రంగడు (అక్కినేని) కష్టాలను పువ్వుల్లాగా భరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వీరయ్య ఒక మిల్లులో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. పురుషోత్తం అనే భాగస్వామి హత్యానేరం అన్యాయంగా వీరయ్యమీద పడుతుంది. ఫలితంగా వీరయ్య జైలుకు వెళతాడు. వీరయ్య కొడుకు రంగడు కష్టించి తన చెల్లెలు పద్మ (విజయ నిర్మల) ను చదివిస్తాడు.
ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.
ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి (జమున)ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.
 
== సినీ విశేషాలు ==
* ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నాడు.[[ఆస్తిపరులు]], [[సుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది అతని ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది.
 
* సినిమా మొదలయ్యే దిశలోనే ఈ సినిమా కధా రచయితలు మారిపోయారు. మొదట [[గొల్లపూడి మారుతీరావు]]తో కధారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రెడియో]] కు బదిలీ అయ్యారు. అసంపూర్తిగా ఉన్న కధను రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] తో పూర్తి చేయిద్దామనుకొన్నారు, అయితే ఆయన కూడా అప్పుడే [[మద్రాస్]] వదిలి [[విజయవాడ]] చేరుకోవడంతో ఆయనతొ కుదరలేదు. ఇక అప్పటికి [[బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతి చెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కు ఆ భాద్యతలు అప్పగించారు.
 
* ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచనను తదనంతరం కొంతవరకూ సినిమాకు అనుగుణంగా దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]], నిర్మాత [[దుక్కిపాటి మదుసూదనరావు]] లు దిద్దుకొని వాటికి సంపూర్ణతను చేకూర్చారు.
 
* ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]] లు కీలక పాత్రలు పోషించారు.
 
* ఈ చిత్ర కధానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కధానాయకిగా ఎన్నిక చేసారు.
పంక్తి 47:
* [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
 
* ఈ చిత్రంలో అక్కినేని, నాగయ్యలు తండ్రీ కొడుకులు. సన్ని వేశపరంగా వీళ్ళిద్దరూ జైలులో కలుస్తారు. ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
 
* ఈ చిత్రంలో 'నీ జిలుగు పైట నీడలోన నిలువనీ' అనే ఒక పాటను కలరులో తీయటం విశేషం. ఆ రకంగా రంగుల చిత్రానికి అన్నపూర్ణ వారు తెర తీసారు. అలాగే ఈ చిత్రంలో ప్రజాదరణ పొందిన పాటలతో పాటు ఒక [[బుర్రకధ]] కూడా ఉంటుంది.
 
== పాటలు ==
{| class="wikitable"
|-
పంక్తి 90:
|}
 
== మూలాలు ==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 
[[en:PulaPoola Rangadu]]
 
[[en:Pula Rangadu]]
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు