"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

 
==జీవిత విశేషాలు==
స్థానం నరసింహారావు [[1902]] సంవత్సరం [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో హనుమంతరావు మరియు ఆదెమ్మ దంపతులకు జన్మించాడు. 1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర నాటకం]] లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించారు. తెనాలి లోని [[శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించారు.
స్థానం నరసింహారావు [[1902]] [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో జన్మించాడు.
 
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453655" నుండి వెలికితీశారు