స్నేహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో [[స్నేహ భావం]] ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, [[బంధువులు]] లేని వారైన ఉంటారేమే గాని [[స్నేహితులు]] లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. [[అమ్మ ప్రేమ]] , స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.
 
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా '[['ఫ్రెండ్‌షిప్‌డేఫ్రెండ్‌షిప్‌ డే]] ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.
 
* స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- [[చింగ్‌చౌ]]
* [[శత్రువు]] ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - [[వివేకానందుడు]]
* [[విశ్వాసం]] లేకుండా స్నేహం ఉండదు -[[ గౌతమబుద్ధుడు]]
* మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్న ప్రియమైనది ఏదీ ఉండదు -[[ గురునానక్]]
* కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
* [[అహంకారి]] కి మిత్రులుండరు - [[ఆస్కార్‌వైల్డ్]]
* ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది [[జ్ఞాపకం]] ఉంచుకోవడమే స్నేహం - [[గాంధీ]]
* ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం -[[కార్డినల్‌న్యూమాన్]]
* చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - [[మార్టిన్ లూథర్‌కింగ్]]
* నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు0చువాడే నిజమైన నీ [[స్నేహితుడు]] - [[బెంజిమన్ ఫ్రాక్లిన్]]
* మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు -[[ స్వీడెన్ బర్గ్]]
* మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - [[లియోటాల్‌స్టాయ్]]
* మిత్రున్ని మించిన [[అద్దం]] లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వ[[సంపూర్ణుడు]] కాలేడు - [[సెయింట్ బెర్నార్డ్]] (ఈనాడు 3.8.2008)
"https://te.wikipedia.org/wiki/స్నేహం" నుండి వెలికితీశారు