శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో [[రజతోత్సవాలు|రజతోత్సవాలను]] 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో [[కావ్యకంఠ గణపతి శాస్త్రి]] గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి శ్రీ [[బూర్గుల రామకృష్ణారావు]] ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.
 
దీని [[స్వర్ణోత్సవాలు]] 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.
 
భాషానిలయ [[వజ్రోత్సవాలు]] 1962 సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[దామోదరం సంజీవయ్య]] గారి అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు.
 
ఈ గ్రంథాలయంలో సుమారు 40,00 పైగా గ్రంథాలు మరియు పత్రికలు సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.