సముద్రాల రామానుజాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి [[సముద్రాల రాఘవాచార్య]] కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండితవంశం.వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం.
1923 వ సంవత్సరం లో జన్మించాడు. 1985 మే 31న కాలం చేశారు.
 
రాఘవాచార్యులుగారు 'ప్రజామిత్ర' పత్రికలో పనిచెయ్యడానికి [[మద్రాసు]]కి మకాం మార్చడంతో, రామానుజం కూడా మద్రాసు చేరి, జార్జ్‌టవున్‌లోని హైస్కూల్లో చదివాడు. హైస్కూలు చదువులో వుండగానే, అతను రాసిన పద్యాలు, గేయాలూ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'సముద్రుడు' పేరుతో 'ప్రజాబంధు'లో రాసేవాడు. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్‌సి.కి వచ్చాడు. ఆ వేళకి పెద్ద సముద్రాలవారు సినిమాలకి వచ్చేశాడు. ఐతే, తనలాగా తనయుడికీ సినిమా ఉత్సాహం రాకూడదనీ, పెద్ద ఇంజనీరు కావాలనీ ఆయన ఆశించారు
పంక్తి 9:
 
"బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.
 
యన్‌.టి.రామారావుగారికి- రామానుజం రికార్డిస్టుగా వున్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశారు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించారు. 'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశారు జూనియర్‌ సముద్రాల. <ref>http://www.eenadu.net/archives/archive-14-10-2009/ncineshow.asp?qry=gnapaka</ref>
==సినిమాలు==
*శ్రీ దత్త దర్శనం (1985)
Line 22 ⟶ 24:
==బయటి లంకెలు==
* http://www.imdb.com/name/nm0431695/
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[en:Samudrala Ramanujacharya]]