గోరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
== వ్యాధులు ==
వ్యాధిని బట్టి గోళ్ల ఆకృతి మారిపోవచ్చు. గోళ్ల మీద గాట్లు పడొచ్చు. లేదా ఉబ్బెత్తు గీతలు (రిడ్జెస్‌) రావచ్చు. చిన్నచిన్న గుంటలు పడొచ్చు. లేదూ గోరు రంగు మారిపోవచ్చు. వీటి ఆధారంగా వ్యాధులను పసిగట్టే అవకాశం ఉంది. గోళ్లు నెమ్మదిగా పెరుగుతుంటాయి కాబట్టి వీటిని చూసి.. ఏదైనా వ్యాధి మనం గుర్తించటానికి పూర్వం ఎంత కాలం నుంచీ ఉందన్నది గ్రహించొచ్చు. గోరు ముక్కను పరీక్షించటం ద్వారా జీవక్రియలకు సంబంధించిన లోపాలు గుర్తించటం, జన్యుపరమైన విశ్లేషణలు చేయటం తేలిక.
 
* [[గోరుచుట్టు]] : గోరు చుట్టుప్రక్కల చీము పట్టి వాచి బాగా [[నొప్పి]] పెట్టే వ్యాధి.
*సోరియాసిస్‌ బాధితుల్లో 10-15% మందికి గోళ్లు కూడా ప్రభావితమవుతాయి. సాధారణంగా చర్మ సమస్యతో పాటే ఈ గోళ్ల సమస్యా వస్తుందిగానీ కొందరికి కేవలం గోళ్లు మాత్రమే ప్రభావితం కావచ్చు. వీరిలో ప్రధానంగా గోళ్ల మీద చిన్నచిన్న గుంటలు పడతాయి.
"https://te.wikipedia.org/wiki/గోరు" నుండి వెలికితీశారు