ఆస్కార్ షిండ్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
==నాజీల ఆకృత్యాలు==
నాజీలు యూదులకు రోజుకు గుక్కెడు నీళ్ళు, రెండు బ్రెడ్ ముక్కలు మాత్రనే ఆహారంగా ఇచ్చేవారు. తిండి సరిపోక చనిపోవాలి. లేదా రోగంతో పోవాలి. నీరసంతో పని చేయలేక చావాలి. మొత్తానికి యూదులు చచ్చిపోవాలి. జర్మనీ లో ఒక్క యూదు జాతీయుడు కూడా మిగలకూడదు. ఇదే నాజీల లక్ష్యం.
 
అలాంటి సమయంలో యూదుల కోసం షిండ్లర్ నానా కష్టాలు పడ్డాడు. వారికి సరైన ఆహారం, వైద్యం అందే ఏర్పాటు చేశాడు. గెస్టపో అధికారులు సోదాకు వస్తే వారికి లంచాలు ఇచ్చి పంపేసేవాడు. ఇందుకోసం సుమారు 40 లక్షల మార్క్స్ (జర్మన్ కరెన్సీ) ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టాడు. ఇల్లూ,పొలాలు ఆఖరుకు భార్య నగలతో సహా అన్ని అమ్మేశాడు. తన దగ్గర పనిచేసే 1200 మంది యూదుల్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఆ క్యాంపులో యూదులకు తండ్రి లాంటి వాడైతే అతని భార్య ఎమిలీ వారికి తల్లిలా సేవలు చేసేది. జబ్బు పడిన వారికి వైద్యం చేసేది.
 
తన వద్ద ఉన్న యూదుల్ని ఇలా దాదాపు నాలుగేళ్ళపాటు కాపాడుకున్నాడు షిండ్లర్. ఈ క్రమంలో రెండు సార్లు జైలుపాలు కూడా అయ్యాడు. నాజీల పాలన అంతమయ్యేనాటికి అతని ఆస్తులు దాదాపు కరిగిపోయాయి. అలాంటి స్థితిలోనూ తను కాపాడిన యూదులందరికీ వీడ్కోలు పలికేందుకు బహుమతిగా దుస్తులు, మద్యం పంచిపెట్టాడు. ఎన్ని మంచి పనులు చేసినా తానొక నాజీ అధికారి కాబట్టి శత్రుదేశాల సైన్యాధికారులకు భయపడి భార్యతో సహా [[అర్జెంటీనా]] కు వెళ్ళిపోయాడు. అక్కడొక చిన్న అపార్ట్‌మెంట్ లో అతని జీవితం మళ్ళీ మొదలైంది.
 
కొన్నేళ్ళ తర్వాత జర్మనీ వచ్చి చిన్నా చితకా వ్యాపారాలెన్నో చేశాడు.. కానీ ఏదీ కలిసి రాలేదు. ఒకప్పుడు లక్షాధికారిగా విలాసజీవితం గడిపిన షిండ్లర్ చివరి రోజుల్లో దారిద్య్రంలో బతుకు వెళ్ళదీశాడు. అతని దగ్గర ప్రాణాలు నిలుపుకున్న యూదులంతా అనేక దేశాల్లో స్థిరపడ్డారు. [[ఇజ్రాయెల్]] ఉన్నవారు ఏటా అతడి పుట్టిన రోజు నాటికి తమ దేశానికి పిలిచి సత్కరించి పంపేవాళ్ళు. ఆయన చనిపోయాక జెరూసలెం పురవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గడ్డపైనే సమాధి చేసి తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం షిండ్లర్ ను ''రైటియస్ అమాంగ్ ది నేషన్స్'' పురస్కారంతో గౌరవించింది.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/ఆస్కార్_షిండ్లర్" నుండి వెలికితీశారు