టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''టేకుమళ్ళ అచ్యుతరావు''' (1880 - 1947) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' (1880 - 1947) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు.
 
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతన వలసపోతనవలస]] గ్రామంలో రామయ్య మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను [[పర్లాకిమిడి]] లోను మరియు బి.ఎ.ను [[విజయనగరం]]లోను పూర్తిచేశారు. తర్వాత [[రాజమండ్రి]]లోని ప్రభుత్వ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు.
 
వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. [[పింగళి సూరన]] రచించిన గ్రంథాలను గురించి వీరు ఆంగ్లంలో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు. వీరు "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాన్ని కూడా రచించారు.
 
వీరు 12 ఫిబ్రవరి, 1947లో [[మద్రాసు]]లో పరమపదించారు.
 
[[వర్గం:1880 జననాలు]]