గృహ ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
{{అయోమయం}}
'''గృహ ప్రవేశం''' కొత్త [[ఇల్లు]] లేదా [[గృహము]] కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే [[పండుగ]]. [[హోమం]], నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు మరియు స్నేహితులకు [[విందు]], [[గోవు]]తో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలు.
[[ధర్మ సింధు]]<ref>గృహ ప్రవేశము, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 673-4.</ref> ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉన్నది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ [[స్నానాలు]] చేసి బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహ ద్వారము వద్ద దూడతో ఉన్న [[ఆవు]]ను పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో నింపిన [[గుమ్మడి]]కాయ బలిహరణము (ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నము) ఈయవలెను. దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలెను. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించవలెను. దీనిని "గంగపూజ" అందురు. శుభ ముహూర్తమున దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడికాలు, ధర్మపత్ని ఎడమకాలు గృహమునందు పెట్టవలెను.
|