పల్నాటి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==చారిత్రకత==
క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో [[కారంపూడి]] వద్ద పల్నాటి యుద్ధం [[శైవులు]], [[వైష్ణవులు]] మధ్య జరిగింది. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. పల్నాటి యుద్ధం ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన యుద్ధం అయినప్పటికీ సమకాలీన శాసనాలలో గానీ, ఆ తరువాత శాసనాలలో గానీ ఈ యుద్ధం యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. శాసనాలలో పేర్కొనక పోయినా ఈ యుద్ధం జరగలేదని భావించుటకు వీలులేదు. [[క్రీడాభిరామం]]లో పలనాటి యుద్ధ గాథలు పేర్కొనటమే గాక ఓరుగల్లు నగరములో వీరచరిత్రను గానం చేయటం, అక్కడి యువకులు ప్రేరణ పొందటం , [[ఓరుగల్లు]] ఇళ్లలో పలనాటి యుద్ధ చిత్రాలు చిత్రించబడి ఉండటాన్ని వర్ణిస్తుంది. ఈ క్రీడాభిరామానికి మూల సంస్కృత గంథమైన ప్రేమాభిరామాన్ని [[రావిపాటి త్రిపురాంతకకవి]] పలనాటి యుద్ధం జరిగిన తరువాత 50-60 సంవత్సరాలకు వ్రాశాడు. పలనాటి యుద్ధంలో ఓడిపోయిన [[బ్రహ్మనాయుడు|బ్రహ్మనాయుని]] అనుయాయులు ఓరుగల్లు చేరి [[కాకతీయులు|కాకతీయుల]] కొలువులో చేరారు. కనుక ఓరుగల్లులో పలనాటి వీరగాథ బాగా ప్రచారములోకి వచ్చినది. ఇదే విషయము ప్రేమాభిరామంలో కూడా పేర్కొనబడినది. [[కారంపూడి]]లో యుద్ధం జరిగిన స్థలం గుర్తించబడినది. యుద్ధంలో మరణించిన వీరులకు [[గుడి]] కట్టి ఉన్నది. పలనాటిలో ఆ వీరులకు పేరు పేరునా ప్రతి సంవతరం పూజలు జరుగుచున్నవి. కనుక పలనాటి యుద్ధం యదార్ధ చారిత్రక సంఘటనే అని చెప్పవచ్చు.
 
==నాయకురాలు నాగమ్మ==
"https://te.wikipedia.org/wiki/పల్నాటి_యుద్ధం" నుండి వెలికితీశారు