సర్వనామము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఉదాహరణ : ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి మరియు ఇలాంటివి సంబంధ సర్వనామాలు.
; 2. విశేషణ సర్వనామము : సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు "విశేషణ సర్వనామాలు".
ఉదాహరణ : అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.
; 3. సంఖ్యావాచక సర్వనామము : సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు "సంఖ్యావాచక సర్వనామాలు".
ఉదాహరణ : ఒక నియమము - ఇద్దరూ ఒకటి - ముగ్గురుగా మారతారు. ఇందులో ఒక - ఇద్దరు - ముగ్గురు అనేవి సంఖ్యావాచక సర్వనామాలు.
; 4. సంఖ్యేయవాచక సర్వనామము : ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక "సంఖ్యేయవాచక సర్వనామం".
; 5. పురుషలకు సంబంధించిన సర్వనామం : ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి "పురుషలకు సంబంధించిన సర్వనామాలు".
"https://te.wikipedia.org/wiki/సర్వనామము" నుండి వెలికితీశారు