నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
==నెయ్యి వినియోగం-భిన్నాభిప్రాయాలు==
 
నెయ్యిఉపయోగం,వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి.ఆయుర్వేదం మరియు మరికొన్ని దేశీయవైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహరం.జ్ఞాపకశక్తిని,జీర్ణశక్తిని పెంచుతుందని,తెలివిని పెంచుతుందని, రోగనిరోధశక్తిని మెరగుపరుస్తుందని,మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం.అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహరంతోపాటు తీసుకొవటం వలన హృదయసంబంధిత వ్యాధులోచ్చె అవకాసంమెండుగా వున్నది.నెయ్యిలోవున్న చిన్న,మరియు మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బనుగొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరంమేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్తకు వున్నది.నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచులక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం.మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిలశక్తి యిచ్చు ఆహరం అవసరం.మానవుడు తీసుకునే ఆహరంలోని కిలో,కెలరిలలలో,తీసుకునే నెయ్యిలేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌విలువ 10% మించరాదు(180కెలరిలు).రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిలశక్తిని కలిగి వుండును.అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణఆసియాప్రజలలో(ఇండియా,పాకిస్దాన్,బంగ్లా)హృదయసంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది.ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం ఉభయత్ర శ్రేయస్కరం.
 
'''నెయ్యి వినియోగం'''
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు