గులేబకావళి కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==సంక్షిప్త చిత్రకథ==
పాటలీపుత్ర మహారాజు (మిక్కిలినేని) కు ఇద్దరు భార్యలు. రెండవ భార్య (ఛాయాదేవి) కు ముగ్గురు కొడుకులు. పెద్ద భార్య (ఋష్యేంద్రమణి) ఒక సిద్ధుని వరంచేత గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డ వల్ల తనకు చూపుపోతుందని తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు (రామారావు) కోయగూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు.
 
మహారాణి తమ్ముడు (రాజనాల) రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తుంటాడు. ఇంతలో రాజుకు కళ్ళుపోతాయి. 'గులేబకావళి' పుష్పం తెచ్చి రాజు కన్నులకు తాకిస్తే చూపు వస్తుందని తెలియడంతో దానిని తేవడానికి ముగ్గురు మూర్ఖులైన చిన్న భార్య కొడుకులు బయలుదేరతారు. విజయుడు కూడా ప్రయాణమవుతాడు.
"https://te.wikipedia.org/wiki/గులేబకావళి_కథ" నుండి వెలికితీశారు