"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

చి ({{మహాభారతం పర్వాలు}} మూస చేర్చాను)
 
=== ధృతరాష్ట్ర హృదయం ===
[[File:The blind Dhritarashtra attacks the statue of Bhima.jpg|thumb|భీముని లోహ విగ్రహాన్ని ముక్కలు చేస్తున్న ధృతరాష్ట్రుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారు వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే [[భీముడు]] అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన [[కృష్ణుడు]] తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహవిగ్రహమే [[భీముడు]] అనుకుని [[ధృతరాష్ట్రుడు]] ఘాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా ! అతడు మూర్చిల్లాడు. తరువాత " నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను " అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న [[శ్రీకృష్ణుడు]] ధృతరాష్ట్రుడి భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు. నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని నీ ముందుంచాను. నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలం ముందు ఈ భీముడెంత ! ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు ! కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా ! అయినా మహారాజా ! భీముడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా ! అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప " అన్నాడు.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694302" నుండి వెలికితీశారు