స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్)..అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హొటల్ నడుపుకుంటూ ఉంటారు.. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం.. స్ధానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మ కు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి.. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మ కి శిష్యునిగా చేద్దామను కుంటుంది.. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్న్నాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు.. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ..గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్క్తుతుంది.. ఇంతలో కాలేజి లో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు.. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు.. కాలేజి లో ఆడషన్ లో మరో స్వరం తో అదే పాట వినిపిస్తాడు..అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు..అనంత రామశర్మ నిస్సంతు.. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది.. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు.. అనంత రామశర్మ వలన కాని స్వర రచన ను గంగాధరం ప్రయత్నిస్తాడు..ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు.. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ గా సెలక్టై ట్రైనింగ్ అవుతున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు.. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు.. ఈ సంఘటన తో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది..<br />
కథ ప్రస్తుతానికి వస్తుంది.<br />
అనంత రామశర్మ ను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అనంత రామశర్మకుఅతనికి స్వస్తత చేకూరుతుంది.. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది .. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ.. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక.. దానితో సినిమా ముగుస్తుంది..<br />
 
== చిత్రవిశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/స్వాతి_కిరణం" నుండి వెలికితీశారు