విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
[[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
[[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు). [[1947]] లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా [[విశాఖపట్టణం జిల్లా]]. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం]], విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.[[విజయనగరం]] జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విశాఖపట్నం జిల్లా నుంచి 15 ఆగష్టు 1950 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా ఏర్పడింది
 
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. రుషికొండ, రామకృష్ణ బీచ్ , భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే [[కొండకర్ల ఆవ]], తాటి దోనెల లో [[కొందకర్ల ఆవ]] లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు