గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఉర్దూ భాషలో 'గజల్' సుప్రసిద్ధమైనది.ఉర్దూ కవులలొ అనేకులు ఈ పద్ధతినే అనుసరించారు.గాలిబ్ గజల్ రీతిలోనే కాకుండగా ఇతర పద్ధతులలో కూడా కవిత్వం రాసినప్పటికి,గజల్స్ లో కబ్బం అల్లుటలో ప్రసిద్ధి చెందాడు.ఇతరులకు మార్గదర్సకుడుగా నిల్చినాడు.గాలిబ్ మానవ జీవితమును సమగ్రముగా తన కావ్య దర్పణంన ప్రతిఫలింపజేసాడు.జీవితంను దాని భిన్న కోణములను రమ్యంగా,హృద్యంగా రచించిన మొదటి ఉర్దూ కవిగా గాలిబ్ కవి అన వచ్చును. జీవితం,అందులోని విలాసం,విషాదం,తీపిదనం,చేదు మరియు ఒడుదుడుకులను తన కవిత్వంలో ప్రదర్సించాడు గాలిబ్.అట్టి గాలిబ్ ఉర్దూ గజల్స్ ను దాశరథి మిక్కిలి ప్రతిభావంతంగా తెలుగు భాషలోకి అనువదించాడు.అనువాదం చాలా సుభోదకంగా,సరళంగా వున్నది.గాలిబ్ కవనంలోని హైందవేతర వాతవరణంను హైందవ వాతవరణంగా పరివర్తించి,కవితకు తెలుగుదనం అబ్బి,తన ప్రత్యేకత ప్రతిభను చూపించాడు దాశరథి.
దాశరథి గాలిబ్ గజల్స్ ను హృదయాంతర్గతంకావించుకొని,అనన్యమైన రీతిలో తెలుగీకరించినాడు.ఉర్దూమూలంనకు సన్నిహతంగావుండులా అనువాదమొనర్చినాడు.కడు రమ్యంగా,రమణీయయుతంగా కొనసాగినదు రచన.గాలిబ్ గజల్లను ఒక్కొక్కదానిని తీసికొని ఆమూలాగ్రంగా దాశరథి అనువాదమొనర్చలేదు.గజల్స్ లోని కొన్నీ'షేర్' లనే అనువాదమొనర్చినాడు.
గలిబ్ యొక్క గజల్స్ లోని ఉత్తమ విభాగాలను అనువాదానికి ఎన్నుకకొనుటలో దాశరథి కవితాహృదయం,మరియు ఆయన ప్రతిభ తెలుయుచున్నది.దాశరథి అనువాదమొనర్చిన ఈ ఖండకృతులలో గాలిబ్ కవిప్రేమార్ధ్ర హృదయం కంపించుచున్నది.గాలిబ్ ప్రియురాలు నొకమారు ప్రసన్నవదని,మరోమారు పరాణ్ముకురాలు.చంచలమనష్కిని,గాలిబొక్కడే ఆమె ఏకైక ప్రియుడుకాడు.ఆమె మనస్సు చూరగొన్నవారున్నారుచూరగొన్న వారు న్నారు.అయిన గాలిబ్ ఈర్ష్యకాని,కోపంకాని చెందలేదు.తన చెలియెడ అంతటి అనురాగమున్నది.నిజంగా గాలిబ్ జీవితం ఒక విషాదగాథ.గాలిబ్ ప్రేమ స్వార్థరహితమైనది.గాలిబే స్వయంగా"నాకు నిష్కామ కర్మ యెంతయో ప్రియం"అనిచెప్పుకున్నాడు.
 
ఉర్దూ గజలులు రెండు పద్యపాదంలను మాత్రమేకల్గివుండును.దాశరథి గారుకూడా క్లుప్తత చెడకుండా రెండుపాదాలలోని భావాన్ని చాలావరకు రెండుపాదాలలోనే వ్రాసాడు.వివరణ అవసరమైనచోట పద్యపాదాలను నాలుగు పాదాలుగా పెంచిరాసాడు.అనువాదానికి ఆటవెలది,తేటగీతం వాడుకున్నాడు.అవసరమైనచోట ద్విపదను,రగడను ఉపయోగించినాడు.
 
'''మచ్చునకు కొన్ని పద్యాలు '''
 
*'''ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము'''
 
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.
*'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్తి ప్రతిపని దివ్యమగును.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు