బోయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
భారత దేశంలో వేటను ప్రధాన వృత్తిగా చేసుకొన్న అడవి తెగలు చాలా ఉన్నాయి. వారిలో బోయ అనేది ఒక అడవి తెగ. వీరు [[ఆంధ్ర ప్రదేశ్]] లో పూర్వం నుండి వేటను వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కుల విభజన ప్రకారం వీరు బి.సి గ్రూపులో 24 వ కులస్తులు. బోయ తెగవారిని బోయలు అని పిలుస్తారు. వీరిని వాల్మీకి ,బేడరు , కిరాతక , నిషాది , ఎల్లాపి బోయ , తలహరి , చుండు పేర్లతో కూడా పిలుస్తారు. రాయలసీమలో బోయలుగా, తెలంగాణలో వాల్మీకి కులస్తులుగా చూస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో యెల్లాపులు అని పిలు స్తారు.
 
ఉత్తర భారతదేశంలో వేటను ప్రధాన వృత్తిగా కలిగిన కిరాతులను బోయలు తమ పూర్వీకులుగా భావిస్తారు. వీరి పేర్ల చివర నాయక్నాయక అని ఉండటం సాధారణం. బోయవారు తిరుపతి వెంకటేశ్వరుడిని, మరియమన్న, శివుడు, సుబ్రమణ్యం మొదలగు వారిని ఆరాధిస్తారు. బోయవారిలో శివుడి భక్తుడైన భక్త కన్నప్ప గొప్పవాడు.
 
బోయవారు 10 నుండి 15 శతాబ్దాలవరకూ చోళ, చాళుక్య, విష్ణుకుండిన, హోయసల సామ్రాజ్యాల్లో సైనికులుగా, సైన్యాద్యక్షులుగా విధులు నిర్వహించారు. కాకతీయుల సైన్యంలో ముసునూరి నాయకులతో పాటూ బోయవారు కూడా చేరారు. కర్నాటకలో విజయనగర సామ్రాజ్యంలో 10 నుండి 18 శతాబ్దాల మధ్య చిత్రదుర్గ కోటను సామంతరాజులైన రాష్ట్రకుటులు, చాళుక్యులు, హోయసాలులతో పాటూ బోయలు కూడా చిత్రదుర్గ కోటను నిర్మించారు. విలువిద్యలో మరియు యుద్ధవిద్యలో నేర్పరులైన బోయవారు హంపి విజయనగర రాజులు తమ సామ్రాజ్యాల్లో బాగాలైన కళ్యాణ దుర్గం, రాయదుర్గం సంస్థానాలకు సామంతరాజులుగా సేవలందించారు.
 
==బోయ, కిరాత తేడాలు==
కిరాతులు అనే తెగ నేపాల్ మరియి అస్సాంలో నివసించే అటవీ తెగ. వేట వారి ప్రధాన వృత్తి. క్షత్రియుల్లో నాగవంశానికిసూర్య,చంద్ర వంశానికి చెందిన కిరాతుల్లోబోయలు సుమారు 29 రాజులు పరిపాలించారు. మహా భారతం మరియు మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణాలనుబ్రాహ్మనులను వ్యతిరేకించిన కిరాతులు ఉపనయనాది ఆచారవ్యవహారాలను పాటించకపోవడముతో క్షత్రియహోదాను కోల్పోయారు అంటాడు మనువు తన మనుధర్మశాస్త్రములో. ఒక్క రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి మాత్రం గొప్పవాడైయ్యాడు. కిరాతులవలె అడవి జంతువుల వేట జీవనోపాధిగా కలిగివున్న తెగలు చాలా తెగలున్నాయి. ఉదాహరణకు బోయలు, చెంచులు, కోయలు, కొండారెడ్డిలు వంటివారు. కిరాతుల సంస్కృతికి బోయ సంస్కృతికి చాలా వైవిధ్యాలున్నాయి. కిరాతులు 'సకేల' అనే పండుగను సంవత్సరానికి రెండు సార్లు ఉభయులి మరియు ఉధయులి అనే పేర్లతో జరుపుకుంటారు. కిరాతుల మతం కిరాతి ముందంమతం. వారికి మత గ్రంధం కూడా ఉన్నది. కాని బోయవారికి అటువంటిది లేదు. కిరాతులతో పోలిస్తే బోయవారి కట్టుబాట్లు మరియ వివాహ సంస్కృత విభిన్నంగా ఉంటుంది. కిరాతులు మంగోలీ జాతుల విభాగానికి చెందినవారైతే, బోయలు ద్రావిడ తెగల విభాగానికి చెందినవారు. దీన్ని బట్టి బోయవారు కిరాతులు కాదని, అయితే కిరాతుల వంటి వేటగాళ్ళని తెలుస్తున్నది. సంస్కృత మహాబారతంలో పేర్కొనబడ్డ కిరాతులను తెలుగు కవులు ఆంధ్రులకు బోయవారిగా పరిచయం చేశారు. ఉదాహరణకు ఉత్తర భారత దేశంలో నిషాఢ తెగకు చెందిన [[ఏకలవ్యుడు]], కిరాత తెగకు చెందిన [[వాల్మీకి]] మహర్షి తెలుగులో అనువదింపబడిన మహాభారతంలో తెలుగువారికి బోయ తెగవారిగా పరిచయమయ్యారు. నేడు బోయ కులం బి.సి కులంగా గుర్తింపు పొందినది.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/బోయ" నుండి వెలికితీశారు