ఐరీన్ జూలియట్ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==పరిశోధనలు==
మేరీ క్యూరీ నడిపే రేడియం ఇన్‍స్టిట్యూట్ లో ఫ్రెడెరిక్ జూలియట్ ఆమె అసిస్టెంటుగా పనిచేసేవారు. అతనితో ఐరీన్ కు బాగా పరిచయమై ఇరువురి అభిరుచులు, పనిచేసే రంగం, చోటు ఒక్కటే కావడం వల్ల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ మేరీ పర్యవేక్షనలో పరిశొధన మొదలుపెట్టారు. ఆల్ఫా కిరణాల గురించి కొంత ప్రయోగం జరిపి వుండడం వలన ఐరీన్, [[రేడియోధార్మికత]] గురించి అధ్యయనం చేయనారంభించారు. ప్రకృతి సిద్ధమైన కృత్రిమమైన రేడియో ధార్మికతల గురించి, మూలతత్వల మార్పు, న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి నిర్ధిష్టంగా ప్రయోగాలు చేశారు. ఫలితంగా రేడియోధార్మికత మూలతత్వాల కృత్రిమ నిర్మాణం గురించి ఆమె కనుక్కొన్నారు. ఈ పరిశోధనకే 1935లో తన భర్త ఫ్రెడరిక్ తో కలిసి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. తన ప్రయోగాలతో ఇతర మూలతత్వాలను ఆధారంగా తీసుకొని కూడా కృత్రిమంగా రేడియోధార్మిక తత్వాలను సృష్టించవచ్చునని కనుగొన్నారు. నోబెల్ బహుమతిని అందుకున్న తరువాత, 1938లో న్యూట్రాన్ యొక్క భారీ తత్వాల ప్రభావంతో యురేనియంని విడగొట్టే దిశగా మహత్తరమైన ప్రయోగాలు చేశారామె.
 
1932 నుండి పారిస్ ఫాకల్టీ ఆఫ్ సైన్సెస్ లో వ్యాఖ్యాతగా పనిచేసిన ఐరీన్, 1937 నాటికి అక్కడే ప్రొఫెసర్ గా నియమించబడ్డారు. 1946లో ఐరీన్ రేడియం ఇన్‍స్టిట్యూట్ కి డైరెక్టర్ అయ్యారు. దేశంలోని పరమాణు శక్తి కేంద్రం కమీషనర్ గా 6 సంవత్సరాఉ పనిచేశారు. "ఆర్‍సే" లో న్యూక్లియర్ ఫిజిక్స్ కేంద్రాన్ని స్థాపించింది. ఆ కేంద్రంలో ఎక్కువ శక్తి గలిగిన "సిన్‍క్రో సైక్లోట్రాన్" ను రూపొందించింది.
 
===వ్యక్తిగత జీవితం===