హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 131:
* [[కొమురవెల్లి]] : [[సిద్ధిపేట]] నుండి [[హైదరాబాదు|సికిందరాబాదు]] వెళ్ళే మార్గంలో [[సిద్ధిపేట]]కు 10 కి.మీ దూరంలో ఉన్న [[కొమురవల్లి మల్లన్న(మల్లికార్జున) స్వామి దేవాలయం]] చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో [[మకర సంక్రాంతి]] రోజున ప్రారంభమై [[ఉగాది]] వరకు,ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాలనుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు.వీటిని లష్కర్ బోనాలు గా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో [[బోనం]] , [[పట్నం]] అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే,అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం ( అన్నం ) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశం లో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే.ఢమరుకం(జగ్గు) వాయిస్తూ ,జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు.వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి,చేతిలో ముగ్గుపలక,ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణం లో కనువిందు చేస్తారు.జాతర చివరలో కామ దహనం( హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు,విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికం గా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ(బలిజ) పూజారులు , వీరభద్రుణ్ణి , భద్రకాళిని పూజించి,సాంప్రదాయ బద్ధమైన పూజలు జరిపి,రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలం లో టన్నులకొద్దీ కర్రలను పేర్చి , మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు.తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి , కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు.వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని [[అగ్ని గుండాలు]] అని పిలుస్తారు. [[ఫైలు:Bhadrakaliamma_m.jpg|thumb|240px|శ్రీ భద్రకాళి అమ్మవారు]]
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగకు ముందు తొమ్మిది రోజులు [[దేవీ శరన్నవరాత్రి]] ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి .ఆషాఢ మాసం లో జరిగే [[శాకంబరి]] ఉత్సవాలలో అమ్మవారిని కూరగాయలు,పళ్ళతో అలంకరిస్తారు.వైశాఖ మాసం లో కళ్యాణోత్సవం జరుగుతుంది. దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
[[ఐనవోలు మల్లన్న(మల్లికార్జున స్వామి) దేవాలయం]] - పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అందుకే ఆయన పేరిట అయ్యన-ప్రోలు గా పిలువబడి కాలాంతరం లో అయినవోలు , ఐనవోలు లేదా ఐలోని గా పిలువబడుతున్నది. సువిశాల రాతి ప్రాంగణం లో అష్టభుజాకృతిలో 108 స్థంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అండానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉన్నది.ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన ,వరంగల్లు భద్రకాళి దేవాలయం లో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలున్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై,కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగం లో సువిశాలమైన రంగ మండపం ఉన్నది.పూర్వకాలం లో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయం లో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం , ఢమరుకం , పాన పాత్ర ధరించి కనిపిస్తుంది.ఆయనకు ఇరుప్రక్కలా భార్యలు గొల్ల కేతమ్మ,బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి.వీటి ముందు భాగం లో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు , ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని పుణే దగ్గరలో ఉన్న్ 'జెజూరి ' పట్టణం లో ఖండోబా దేవాలయం ఉన్నది. కర్ణాటకలో ఈ స్వామిని మల్హర్ లేదా మల్లారి అని పిలుస్తారు.మల్లాసురుడనే రాక్షసుణ్ణి చంపడం వలన మల్లారి అనే పేరు వచ్చింది.
 
== క్రీడలు==
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు