Sekharbabupandilla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sekharbabupandilla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:55, 4 ఏప్రిల్ 2012 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


తెలుగు నాటకము

మార్చు

తెలుగు నాటకమునకు సంబంధించిన విశేషాలపై ఆసక్తికి ధన్యవాదాలు. ఒక్కొక్క సంస్థ మరియు వారి విశేషాల గురించి ఎక్కువ సమాచారం వేరుగా ప్రత్యేకమైన పేజీలో చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 03:34, 6 ఏప్రిల్ 2012 (UTC)Reply

25 మార్పుల స్థాయి

మార్చు

మీరు ఏప్రిల్ 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:52, 22 మే 2012 (UTC)Reply

తెలుగు వికీపీడియాలో తెలుగు నాటకంపై సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వాడుకరి చర్చ:Rajasekhar1961 ని సంప్రదించగలరు.Pranayraj1985 (చర్చ) 07:40, 26 మార్చి 2013 (UTC)Reply

నాటకం

మార్చు

శ్రీకృష్ణ తులాభారం నాటకం గురించి వివరంగా సమాచారాన్ని చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 14:27, 22 మార్చి 2013 (UTC)Reply

నేను శ్రీ కృష్ణ రాయబారం,శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాల నాటకాల ఫోటోలను అప్ లోడ్ చేశాను.వాటిని నా వ్యాసాలకు అనుసంధానం చేయడమెలా?

మార్చు

{{సహాయం కావాలి}} వాటిని ముందుగా వికీ కామన్స్ లో అప్ లోడ్ చేసి ఆ లింక్ లను వ్యాసపు పేజీలో ఇవ్వాలి.Pranayraj1985 (చర్చ) 09:22, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

బభ్రువాహన

మార్చు

ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి యాగాశ్వం వెంట రక్షకునిగా అర్జునుని పంపుతాడు.దారిలో మణిపుర ప్రదేశం చేరగానే దాన్ని బభ్రువాహనుడనే రాకుమారుడు బంధిస్తాడు.మణిపుర మహారాజు చిత్రవాహనుడు.అతని కుమార్తె చిత్రాంగద.అర్జునుడు తీర్థయాత్రలు చేసే కాలం లో చిత్రాంగదను వరించి కొంతకాలం ఆ రాజ్యం లో ఉంటాడు.వారికి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. ఈ ఉదంతాన్ని తెలిపి అశ్వాన్ని విడవమని,తండ్రితో యుద్ధం సరికాదని తల్లీ,తాత ఎంత వారించినా బభ్రువాహనుడు వినడు.అప్పుడేఅ వచ్చిన ఉలూచి బభ్రువాహనున్ని సమర్థిస్తుంది.తండ్రీమ కడుకుల మధ్యన యుద్ధానికి రంగం సిద్ధం చేస్తుంది.అందుకు కారణం అర్జునుని కారణంగా అస్త్రసన్యాసం చేసిన భీష్ముని సోదరులైన వసువులు ధరుడు,సోముడు తమ అన్నగారి మరణానికి కారకుడైన అర్జునుడు యుద్ధం లో మరణించి నరక ప్రాప్తిని పొందుతాడని శపిస్తారు.గంగాతీరం లో ఆ శాపవచనాలు విన్న ఉలూచి తాను అర్జునుని భార్యనని, తీర్థ యాత్రాకాలం లో తాను అర్జునుని మోహించి తన మాయచే అతడిని నాగలోకానికి తీసుకొని పోయి వివాహమాడి అతనివల్ల ఇలావంతుడనే కుమారుణ్ణి పొందానని తెలిపి శాపవినమోచనాన్ని తెలియజేయమంటుంది.అర్జునుడు యుద్ధం లో తన రక్త సంబంధీకుల చేతిలో మరణించి తిరిగి పునర్జావితుడైతే అతనికి నరకబాధ తప్పుతుందని తెలు పుతారు వసువులు.ఉలూచి ప్రేరేపించిన ఆ యుద్ధం లో కుమారుడైన బభ్రువాహనుని చేతిలో అర్జునుడు మరణించగా తన వద్దనున్న మణి ప్రభావంతో అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంటుంది ఉలూచి.

బభ్రువాహన (నాటకం) వ్యాసాన్ని మొదలుపెట్టాను. మీదగ్గరి సమాచారంతో విస్తరించండి. మీవద్ద నున్న బొమ్మల్ని చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:58, 4 జూన్ 2013 (UTC)Reply

ఏప్రిల్ 27, 2014 సమావేశం

మార్చు

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:57, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply

తెలంగాణా కవులు రచయితలు...వరంగల్ వాసులు.

మార్చు

కోవెల సుప్రసన్న చార్య. ఇందారపు కిషన్ రావు. ఎస్.లక్ష్మణ మూర్తి. కోవెల సంపత్కుమారా చార్య.. గన్నమనేని గిరిజా మనోహర్ బాబు.. అంపశయ్య నవీన్.. పొట్లపల్లి శ్రీనివాస రావు.. కాత్యాయని విద్మహే.. పొట్లపల్లి రామారావు.. మల్లవజ్ఝుల వెంకటరామ శాస్త్రి.. ముదుగొండ శంకర శాస్త్రి.. నల్లన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు.. వానమామలై జగన్నాథా చార్యులు.. రామా చంద్రమౌళి.. బన్న అయిలయ్య.. కేతవరపు రామకోటి శాస్త్రి.. వనం మధుసూదన్.. పీ వీ రమణ.. పల్లా దుర్గయ్య.. కాళోజీ రామేశ్వర్ రావు.. కాళొజీ నారాయణ్ రావు.. వీ ఆర్ విద్యార్థి.. పేర్వారం జగన్నాథం.. ఇంకా చాలామంది పురస్కార గ్రహీతలు కూడా ఉన్నారు.వీరికి సంబంధించిన వివరాలు ఎక్కడ అప్ లోడ్ చేస్తే మీ పరిశీలనకు వస్తుంది?

--2014-04-25T07:55:30 వాడుకరి చర్చ:Sekharbabupandilla

నివాళి

మార్చు
 

నాటకరంగ ప్రముఖుడు పందిళ్ళ శేఖర్‌బాబు మన తెలుగు వికీపీడియా సభ్యుడు కూడా. ఇతడు నాటకరంగానికి చెందిన కొన్ని వ్యాసాలను మనకు అందించాడు. కొన్ని నెలవారీ సమావేశాలకు హైదరాబాదులో హాజరయ్యాడు. ఇతడు 24 తేదీన అకాలంలోనే పరమపదించినట్లు తెలిసింది. అందుకు మనమందరం సంతాపం తెలియజేయడం బాధ్యతగా భావించాలి.--Rajasekhar1961 (చర్చ) 16:40, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

పద్యనాటక రంగానికి తీరనిలోటు

మార్చు

పందిళ్ళ శేఖర్ గారు తెలుగు పద్యనాటకాన్ని తిరిగి పాండవోద్యోగాల నాటి వైభవానికి చేర్చాలన్న పట్టుదలతో తన జీవితాంతం కృషిచేసిన వ్యక్తి. ఆయన మూడురోజుల క్రితం అకాలమరణం పొందారు. ఇది పద్యనాటకరంగానికి తీరనిలోటు. అలానే తెవికీ నెలవారీ సమావేశాలకు హాజరై, తనకు లోతైన అభినివేశం ఉన్న నాటకాల గురించి తెవికీలో వ్రాసి తెలుగు వికీపీడియా అభివృద్ధికి తనవంతు కృషిచేశారు. మరింత మెరుగైన వికీపీడియన్ అయి, తెవికీ సర్వతోముఖాభివృద్ధికి బాటలువేసేలోగానే ఆయన మరణించడం తెవికీకీ లోటే. ఈ సందర్భంగా ఆయన ఉత్తమగతులు పొందాలని ఆకాంక్షిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 03:34, 27 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగు నాటకరంగానికి విశిష్ట సేవలు అందిస్తూ... తెలుగు నాటకాన్ని ప్రజలు టికెట్ కొని చూసేలా తయారు చేయాలని మరియు తెలుగు పౌరాణిక పద్యనాటకానికి పూర్వప్రాభవం తీసుకురావడమే ఆశయంగా బతికిన మా గురువు పందిళ్ళ శేఖర్‌బాబు గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం... ఆయన మరణం తెలుగు పద్యనాటకానికి, తెవికీకీ తీరని లోటు. --Pranayraj1985 (చర్చ) 09:38, 28 ఏప్రిల్ 2015 (UTC)Reply
పందిళ్ళ శేఖర్ గారు భౌతికంగా మన మధ్యన లేకున్ననూ వారి వ్యాసాలను ఉత్తమ వ్యాసాలగా తీర్చిదిద్దగలిగితే ఆయనకు తెవికీ తరఫున సరైన నివాళి అర్పించినట్టవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:18, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.