ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Nikon_F6_face.jpg||thumb|right|250px|నికాన్ ఎఫ్6]]
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ (ఏక కటక పరావర్తన) కెమెరాలు సాధారణంగా ఒక దర్పణం మరియు ఒక పట్టకం గల వ్యవస్థని ఉపయోగిస్తాయి (ఒకే దర్పణంకటకం నుండి [[పరావర్తనం]] చెందటం వలన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని పేరు) . సాధారణ వ్యూ ఫైండర్ (ఎస్ ఎల్ ఆర్ కాని) కెమెరాలలో ఫోటో తీసేముందు బంధించదలచుకొన్న చిత్రానికి, ఫోటో తీసిన తర్వాత ఏర్పడే చిత్రానికి (కొద్దిపాటి నుండి చాలా) తేడా ఉంటుంది. వీటికి భిన్నంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఫోటో తీసే ముందు ఫోటోగ్రఫర్ చిత్రాన్ని ఏ విధంగా బంధించదలచుకొన్నాడో అదే విధంగా చిత్రం ఏర్పడుతుంది.
==చరిత్ర==
ఎస్ ఎల్ ఆర్ కెమెరాలకి మునుపు అన్ని వ్యూ ఫైండర్ కెమెరాలలో రెండేసి కాంతి మార్గాలు ఉండేవి. మొదటిది కటకము (లెన్స్) నుండి ఫిలిం కు కాగా, రెండవది పైన ఉండే రేంజ్ ఫైండర్ కి. వ్యూ ఫైండర్ మరియు ఫిలిం లెన్స్ లు ఒకే కాంతి మార్గాన్ని ఉపయోగించుకోలేక పోవటం మూలాన కెమెరా ముందు వైపు ఏదో ఒక బిందువు వద్ద వ్యూయింగ్ లెన్స్ ను ఫిలిం లెన్స్ వద్ద కలపవలసి వస్తుంది. కొద్దిపాటి నుండి ఎక్కువ దూరంలో ఉండే వస్తువులని చిత్రీకరించటానికి ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ (ద్వికటక పరావర్తనం) లో సమస్యాత్మకం కానప్పటికీ అతి సమీపంగా చిత్రీకరించే సమయంలో లంబనం వలన ఫ్రేమింగ్ లో తప్పులు దొర్లుతాయి. అంతేకాక (తక్కువ కాంతిలో ఉన్న లేదా తక్కువ వేగం గల ఫిలిం ని ఉపయోగించేటప్పుడు) అపెర్చర్ ల వైశాల్యం పెంచటం సులభం కాదు.
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు