శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ శాస్త్రవేత్తలు తొలగించబడింది; వర్గం:భారత శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం [[శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం]] స్థాపించింది.
 
శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.
 
ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది.
 
ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు. ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.
 
భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు. భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.
 
''నువ్వు పనిచెయ్యడమే కాదు ,పనిచేసే అవకాశాలు కల్పించు.'' అనే సిద్ధాంతాన్ని నమ్మే భట్నాగర్ భారతదేశములో వివిధప్రాంతాలలో 12 పరిశోధనా శాలలను స్థాపించారు .జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి. వీరు 01 జనవరి 1955 తేదీన మరణించారు .
 
==భట్నాగర్‌ అవార్డు, Batnagar Award==
 
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు కనబరిచిన ప్రతిభకు నిదర్శనంగా, ఆయా రం గాలకు వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఇచ్చే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవా ర్డులు భారత శాస్త్ర రంగంలో అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు.2010 సం.ప్రఖ్యాతిగాంచిన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాలకు 11 మంది శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. సీఎస్‌ఐఆర్‌ ఫౌండేషన్‌ డే వార్షికోత్సవంలో.. శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ సమక్షంలో సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సమీర్‌ బ్రహ్మచారి పురస్కార విజేతల 2010 సంవత్సరానికి పేర్లు ప్రకటించారు. ఆ వివరాలు..
 
==గణిత శాస్త్రంలో..==
* మహాన్‌ మహారాజ్‌: రామకృష్ణా మిషన్‌కు చెందిన వివేకానంద యునివర్సిటీ- హౌరా
* పలాశ్‌కుమార్‌: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌-కోల్‌కతా
 
==జీవశాస్త్రంలో ..==
* అమిత్‌ ప్రకాశ్‌ శర్మ: ఇంటర్నేషనల్‌ జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ-ఢిల్లీ
* రాజన్‌ శంకర్‌ నారాయణన్‌: సీసీఎంబీ - హైదరాబాద్‌
 
==రసాయనశాస్త్రంలో ..==
* బాలసుబ్రమణియన్‌ సుందరం: జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌-బెంగళూరు
* గరికపాటి నరహరి శాస్త్రి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌
 
==భౌతిక శాస్త్రంలో..==
* షిరాజ్‌ మిన్‌వల్లా: టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌-ముంబయి
వైద్య శాస్త్రంలో..
* కె.నారాయణస్వామి బాలాజీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -బెంగళూరు
 
==ఇంజినీరింగ్‌లో..==
* శిరీషెందు దే: ఐఐటీ- ఖరగ్‌పూర్‌
* ఉపద్రష్ట రామమూర్తి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- -
 
==ఎర్త్‌ సైన్స్‌లో..==
* శంకర్‌ దొరై స్వామి: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ- గోవా
 
ఈ పురస్కారం కింద విజేతలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రూ.5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేస్తారు.
 
 
 
 
website - > Dr.seshagirirao.com/
by Dr.Seshagirirao-MBBS
 
== బయటి లింకులు ==