తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానం లో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను అవినాభావంగా బంధించబడ్డాయి.
==విశేషాలు==
* 1845 జనవరి ఒకటిన ఓ హత్య జరిగింది. ‘‘సాల్టిల్‌లో ఓ హత్య జరిగింది. హంతకుడు స్లో అనే ప్రాంతంలో రైలు ఎక్కాడు. గోధుమ రంగు కోటు ధరించి ఉన్నాడు’’ అనే టెలిగ్రాఫ్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇలా అందింది. అప్రమత్తమైన పోలీసులు హంతకుడి పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష వేసింది. టెలిగ్రాఫ్‌ తీగలే ఉరితీశాయని ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు.
* తొలిసారిగా 1848లో హాంబర్డ్‌, కక్స్‌ హావన్‌ మధ్య మోర్స్‌ టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఏర్పాటయింది.
* 1895లో ఫ్రాన్స్‌ లో ఆల్బెర్ట్‌ టర్‌పైన్‌ అనే శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు.
* 1897, మే 17న ఇటలీలో మార్కోనీ అనే శాస్తజ్ఞ్రుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్‌ తపాలా కార్యాలయ ఇంజనీర్‌ సహకారంతో మొదటి వైర్‌లెస్‌ సంకేతాలను నీటి పైనుండి లివర్‌నాక్‌ నుండి వేల్స్‌ వరకు ప్రసారం చేయించాడు.
* మన దేశంలో 1902లో సాగర్‌ ఐలాండ్స్‌, సాండ్‌ హెడ్‌‌‌‌స మధ్య మొట్టమొదటి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ కేంద్రం ప్రారంభం అయింది.
* సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని తమ రాజ భవనానికి మాత్రం టెలిగ్రాఫ్‌ సౌకర్యాన్ని కల్పించడానికి జార్‌ అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. కార్ల్‌ సీమెన్స్‌ అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్కన తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్‌ రష్యా అంతటా టెలిగ్రాఫ్‌ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
* 1850 : మొట్టమొదటి టెలిగ్రాఫ్‌ లైన్స్‌ కలకత్తా నుంచి డైమండ్‌ హార్బర్‌ వరకు ప్రారంభమయ్యాయి.
* 1851 : ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టెలిగ్రాఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
* 1853 : టెలిగ్రాఫ్‌ కోసం ప్రత్యేక విభాగం ఏర్పడింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
* 1854 : దేశం మొత్తం మీద నాలుగు వేల మైళ్ల టెలిగ్రాఫ్‌ లైన్లు నిర్మాణం జరిగింది.
* 1885 : ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది.
* 1902 : సాగర్‌ ఐలాండ్‌, శాండ్‌ హెడ్‌ ల మధ్య తొలి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషన్‌ ఏర్పాటైంది.
* 1927 : ఇండియా, యుకె మధ్య రేడియో టెలిగ్రాఫ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.
* 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు