ఊరేగింపు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఊరేగింపు''' అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూ...
(తేడా లేదు)

21:47, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు

ఊరేగింపు అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే ఊరికి తెలియపరుస్తూ ప్రదర్శించుట.

పండుగలు, తిరునాళ్లు

ముఖ్యమైన పండుగల, తిరునాళ్ల సమయాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహలను ఆ ఊరిలో ఊరేగింపు చేస్తారు.

వినాయకచవితి

భారతదేశంలో వినాయకచవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనం నాడు చేసే వినాయకుడి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరిగుతాయి.

పీర్ల పండుగ

మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసాన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.

ఇవి కూడా చూడండి

ఉభయం

ఉత్సవము

"https://te.wikipedia.org/w/index.php?title=ఊరేగింపు&oldid=927097" నుండి వెలికితీశారు