జావా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
1991లో ఒక సెట్ టాప్ బాక్సు ప్రాజెక్టు కోసం మొట్టమొదటి సారిగా జావాను తయారుచేసారు. దీని రూపకర్తలు జేమ్స్ గోస్లింగ్, పాట్రిక్ నాటన్, క్రిస్ వర్త్, ఎడ్వర్డ్ ఫ్రాంక్, మరియు మైక్ షెరిడాన్. <ref>Jon Byous, [http://java.sun.com/features/1998/05/birthday.html ''Java technology: The early years'']. Sun Developer Network, no date [ca. 1998]. Retrieved [[April 22]], [[2005]].</ref>ఇంకా బిల్ జాయ్, జోనాథన్ పేన్, ఫ్రాంక్ యెల్లిన్, ఆర్థర్ వాన్ హాఫ్,టిమ్ లింఢామ్ మొదలైన వారు దీన్ని అభివృద్ధి పరచడంలో పాలు పంచుకొన్నారు. మొట్ట మొదటి పనిచేసే వర్షన్ ను రూపొందించడానికి గోస్లింగ్ బృందానికి 18 నెలల సమయం పట్టింది. మొదట్లో జావాను [[ఓక్]] అని పిలిచేవారు (గోస్లింగ్ పని చేసే ఆఫీస్ బయట ఉండే ఓక్ వృక్షానికి గుర్తుగా ఆ పేరు పెట్టాడు). తరువాత [[గ్రీన్]] అనీ, చివరకు జావా అనీ రూపాంతరం చెందింది.<ref>http://blogs.sun.com/jonathan/entry/better_is_always_different.</ref>
జావాను ఇప్పుడు ఇంటర్నెట్ అప్లికేషన్లలో విరివిగా వాడుతున్నప్పటికీ నిజానికి మొదట్లో దీన్ని ఇంటర్నెట్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించలేదు. మైక్రోవేవ్ ఒవెన్లు, రిమోట్ కంట్రోళ్ళు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దీనిని రూపొందించడానికి ప్రేరణ. వీటిలో చాలా రకాలైన సిపియు లను కంట్రోలర్లుగా వాడుతుంటారు. ఒక వర్చువల్ మెషీన్ను తయారు చేసి, దానికోసం సీ/సీ ప్లస్ ప్లస్ భాషలను పోలి ఉండే ఒక కంప్యూటరు భాషను తయారు చేయాలన్నది గోస్లింగ్ మొదట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు. <ref>Heinz Kabutz, [http://www.artima.com/weblogs/viewpost.jsp?thread=7555 ''Once Upon an Oak'']. Artima, Retrieved [[April 29]], [[2007]].</ref>
సీ/సీ ప్లస్ ప్లస్ లతో వచ్చిన సమస్య ఏమిటంటే వీటిలో వ్రాసిన ప్రోగ్రాములు ఏవో కొద్ది ప్లాట్ ఫాం లకోసం కంపైల్ చెయ్యబడేలా రూపొందించబడి ఉంటాయి. సీ/సీ ప్లస్ ప్లస్ ప్రోగ్రామును ఒక సిపియు మీద నడపాలంటే దానికి సంబంధించిన కంపైలర్ వ్రాయాలి. కానీ మార్కెట్లో లభిస్తున్న ప్రతీ సిపియుకూ కంపైలర్ను రూపొందించాలంటే అది ఖర్చు మరియు సమయం తో కూడిన పని. ఈ సమస్యకు పరిష్కారంగానే జావాను కనుగొనడం జరిగింది. జావా మొట్ట మొదటి సారిగా 1995 లో జావా 1.0గా విడుదల అయ్యింది. ''ఒక్క సారి ప్రోగ్రామును వ్రాయండి, ఎక్కడైనా నడపండి'' అన్న నినాదంతో, ప్రస్తుతం ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ప్లాట్ ఫాం లకోసం వర్చువల్ మెషీన్ను తయారు చేశారు. ఈ వర్చువల్ మెషీన్ మంచి రక్షణ వ్యవస్థ కలిగిఉండి, నెట్ వర్క్ యాక్సెస్ ను, మరియు ఫైల్ యాక్సెస్ ను నియంత్రించడం మొదలైన రక్షణపరమైన సౌలభ్యాన్ని కూడా కల్గించింది. అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్లన్నీ జావా అప్లెట్లు నడపడానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించాయి. జావా 2 రాకతో వేర్వేరు ప్లాట్ ఫాం లకు వేర్వేరు కాన్ఫిగరేషన్ లతో విడుదల అయ్యింది. ఎంటర్ ప్రైస్ అప్లికేషన్ల కోసం J2EE గా, మొబైల్ అప్లికేషన్ల కోసం J2ME, సాధారణ అప్లికేషన్ల కోసం J2SE సరికొత్త రూపాన్ని సంతరించుకొంది.no more corrections please
 
== సింటాక్సు ==
"https://te.wikipedia.org/wiki/జావా" నుండి వెలికితీశారు