షకీల్ బదాయూనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
పాత హిందీ పాటలలో [[గజల్]] శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది. గజల్ ప్రక్రియను సినిమాపాటకు ప్రతిభావంతంగా వాడుకున్న కవుల్లో '''షకీల్ బదాయూని''' పేరు ముందుగా చెప్పుకోవాలి.
 
==జీవిత సంగ్రహం==
అగష్టు 3, 1916లో పుట్టిన షకీల్ ఉర్దూ సాహిత్యంలోను, హిందీ సినిమారంగంపైన కూడా తనదైన ముద్రవేసిన కవి. షకీల్ విద్యాభ్యాసం ఇంటివద్దనే జరిగింది. అరబిక్, పర్షియన్, ఉర్దూ, హిందీ భాషలు ఇంటివద్దకు వచ్చి టీచర్లు బోధించారు. ఆయన తండ్రి జమాల్ అహమద్ ఖాదర్ సోక్తా ఖాద్రీ తన కుమారుడు కవి కావాలని ఎన్నడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఆ వంశంలో కవులెవ్వరు లేరు. కవిత్వాన్ని సంప్రదాయిక ముస్లిమ్ కుటుంబాల్లో ఎలా ఆదరిస్తారో అంతకు మించి కవిత్వం వారికి సంబంధమూ లేదు. షకీల్ దూరపు బంధువు జియావుల్ ఖాద్రీ బదయూని ధార్మికమైన కవితలు కొన్ని రాశారు. ఆయన ప్రభావం కొంతవరకు షకీల్ పై ఉండవచ్చు. యాభై, అరవై దశకాల్లో షకీల్ రాసిన పాటలు, ఉర్దూలో ఆయన కవిత్వం దేశాన్ని ఒక్క ఊపు ఊపాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు నౌషాద్ తో కలిసి షకీల్ పనిచేసేవారు. 1961 నుంచి 1963 వరకు షకీల్ వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ పాటలు వింటే ఇప్పటికి కూడా మనం చెవికోసుకు వింటాం. బీస్ సాల్ బాద్ సినిమాలో – కహీం దీప్ జలే కహీం దిల్, ఘరానా సినిమాలో – హుస్న్ వాలే తేరా జవాబ్ నహీం, చౌదివీం కా చాంద్ సినిమాలో – చౌదివీం కా చాంద్ హో పాటలు అప్పుడే కాదు ఇప్పుడు, ఎప్పుడూ కూడా హాట్ ఫేవరేట్స్.
"https://te.wikipedia.org/wiki/షకీల్_బదాయూనీ" నుండి వెలికితీశారు