శ్రీనివాస కధా సుధాలహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వడ్డూరి అచ్యుతరామకవి]] '''శ్రీ శ్రీనివాస కధా సుధాలహరి''' అను శ్రీనివాస కళ్యాణం 1961 వ సంవత్సరం లో రచించారు. 01.01 .1 967 నుండి 10 .01 .1967 వరకు తిరుమల లో ఆర్ష సంస్కృతి విద్యా పీఠం నుండి చదివి స్వామి వారికి కృతి సమర్పణ చేసారు.
 
==కథా సంగ్రహం==
తొల్లి నైమిశారణ్యమున ముని వరేన్యులు నాముష్మిక ఫలప్రదమగు సత్ర యాగము గావించుచు విరామ సమయమున భగవత్కధా కాలక్షేపము గావింప కోరిక కలవారై సకలాగమ పురాణ తత్వ రహస్యార్ద వేదియు,భూత వర్త మానాగమ కధాకధన చాతురీ ధురీణుడగు సూతుని గాంచి మహాత్మా! మీ అనుగ్రహముతో అనేక ధర్మ రహస్యముల పురాణములు వినియుంటిమి మాకొక్క ధర్మ సంశయము కలదు ఏమన అచిర కాలమున భూలోకము కలిచే ఆవరింప బడుచున్నది కదా! కలి మాయా విశేషమున మానవు లెల్లరు అక్రమ మార్గముల,అన్యాయ పధముల సంచరించుచు పాపము లాచరించుచు పుణ్య కార్యములు చేయక సంసార దుఃఖములో ఉండి,రాజకీయ కలుషిత స్వాంతులై విషయ విబ్రాంతులై వర్తింతురని విందుము.అని పల్కిన ఆ మునులందరూ ఆశ్చర్య మందుచు సూతుని గాంచి యిట్లనిరి. మహాత్మా! తొల్లి శ్రీమన్నారాయణుడు మత్య కూర్మ వరహాది దివ్యావతారములు దాల్చి జగద్రక్షణ గావించెను.భావి కాలమున కలియుగమున కల్కి రూపము ధరించి దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గావించి ధర్మమునుద్ధ రింపగలడని వినియుంటిమి కాని శ్రీ మన్నారాయణుని ఏకవింశత్యవతారంబుల శ్రీవేంకటేశ్వరుని అవతారమభివర్ణింపబడలేదని తలంతుము. శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడు ఎట్లయ్యే? ఎందులకయ్యే?ఎందు వసించె? ఏయే జగద్దితంబు లాచరించె? వివరింప వేడెదమనిన సూతుండు మునీంద్రులారా! శ్రీ మహావిష్ణువు నారసింహ,రామ కృష్ణాద్యవతారముల వలె కాక నిత్య సేవార్చనలు గావించు భక్తులనుద్ధరించు తలపున బ్రహ్మ దేవుని కోరికపై అర్చావ తారంబున మానవులకభీష్టఫల పదాయకుండును,కష్ట నివారకుండునునై కలి కల్మష ముల హరించుచు కలి యుగాంతము వరకు భూలోకమున శేషా చలమున ఉండు తలంపున అందు నివసించె. మరియు భక్తులు కోరిన చోటుల ఎల్లెడలా దర్శన మిచ్చె దనని బ్రహ్మదేవుని కోరికపై వివరించె. అనిన మునులందరూ సూతుని గాంచి మహాత్మా ! బ్రహ్మదేవుడు విష్ణుని యేమని కోరెను?విష్ణు వేమని వివరించెను?సాకల్యముగా దెల్ప గోరెదము................